మరోసారి తెలంగాణలో ఆంధ్రా బిర్యానీని ఉడికించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంత వంటకాలను, అలవాట్లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండార్స్ చేస్తూ కవిత తాజాగా వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఉద్యమకారులను ఉద్దేశించి ఆనాడు కేసీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రా ప్రాంతంలో వండే బిర్యానీని పేడతో పోల్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ మాటల్ని ఆంధ్రా ప్రాంత ప్రజలు, నేతలు తీవ్రంగా నిరసించారు. సోషల్ మీడి
MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోమారు రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. నేడు ఆమె అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్ట్ కార్డ్ రాశారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ అని అన్నారు. తన కలలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టం చేయరని, కేసీఆర్ దమ్ము ఎంతో కాంగ్రెస్ నేతలకు బాగా…
శ్రీశైలం జలాశయానికి పోటేత్తిన వరద గత 20 రోజులుగా మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నదుల్లో భారీ వరద ఉధృతి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. పూర్తి వర్షాకాలం రాకముందే ఈ సీజన్‌లో రెండోసారి జూరాల డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఈ వరద నీరు నేరుగా కృష్ణా నదిలోకి చేరి శ్రీశైలం జలాశయాన్ని చేరుతోంది. ఇప్పటికే…
MLC Kavitha : పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భద్రాచలం సమీపంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ముంపు గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలు తమకు ఎదురవుతున్న విద్య, వైద్యం, రవాణా వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచే తెలంగాణ జాగృతి…
మెదక్ లో కామారెడ్డి డిక్లరేషన్ సాధన కోసం బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. UPF, తెలంగాణ జాగృతి బీసీల కోసం పోరాడుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు. మెదక్ లో బీసీల సమావేశం పెడితే కొందరు…
తాను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదని, రానివ్వనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, జనాల్లో చర్చ జరిగేందుకే కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ అంటూ హడావుడి చేశారన్నారు. కవిత చేసిందంతా ‘అసెంబ్లీ రౌడీ’ సినిమా తరహా డ్రామా అని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన అభివృద్ది కార్యక్రమాలను ఒక్కరోజు కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…
పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని బస్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని బస్ భవన్ గేటు ముందు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసులు వాహనాల్లో తరలించారు. ఎమ్మెల్సీ కవితను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం బస్ భవన్ వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. బస్ పాస్ ఛార్జీలను పెంచినట్లు ఆర్టీసీ…
ఎమ్మెల్సీ కవిత ఇక రాజకీయంగా ఒంటరేనా? ఆమె పొలిటికల్ స్టెప్స్ అన్నీ ఇక సోలోగా పడాల్సిందేనా? గులాబీ వాసన ఇక ఆమె దరిదాపులకు కూడా చేరదా? లేఖ రాజేసిన అగ్గి అంతకంతకూ అంటుకుంటోందా? తాజాగా నిజామాబాద్ టూర్ ఆ విషయాన్నే చెప్పేసిందా? అసలేం జరిగింది నిజామాబాద్‌లో? ఆమె పొలిటికల్ ఒంటరి అని ఎందుకు స్టాంప్ వేసేస్తున్నారు అంతా? మొన్నటి దాకా…. బీఆర్ఎస్లో ఆమె మాటకు తిరుగులేదు. అక్క నోటి నుంచి మాట రావడమే ఆలస్యం… ఆచరణలో పెట్టేందుకు…
నాన్న దేవుడు... ఆయన చుట్టూనే దయ్యాలు చేరాయి. తెలంగాణ జాతిపిత కేసీఆర్..... అలాంటి మహా మనిషికి కాళేశ్వరం కమిషన్ నోటీస్‌లు ఇస్తుందా? హవ్వ... ఎంత ధైర్యం? మా నాయకుడికి నోటీస్‌లు ఇస్తే... పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? నిరసన తెలపకపోవడానికి రీజనేంటి? బీఆర్ఎమ్మెల్సీ కవిత లేటెస్ట్ మాటలివి. ఎంత గవర్నమెంట్ అయితే మాత్రం.... కేసీఆర్‌కు నోటీస్‌లు ఇస్తారా అంటూ... ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్న కవిత... అందుకు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేశారు.
నేడు బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్.. ఇక ఎర్ర సముద్రమే! 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్లో భంగపడ్డ ఆర్సీబీ.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో…