MLC Kavitha : తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని…
Minister Seethakka: శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వర్సెస్ మంత్రి సీతక్క మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి రాష్ట్రం పరువు తీస్తున్నారని కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పరువు తీసింది ఎవరు? అని ప్రశ్నించింది.
MLC Kavitha: తెలంగాణ బడ్జెట్ లో ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చెప్పిన మాటలే చెప్పడం తప్ప.. అందులో ఎలాంటి నిజాలు లేవన్నారు.
MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
తెలంగాణ శాసన సభ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం మహిళలకు గత 10 సంవత్సరాల కంటే మెరుగైన పథకాలు తీసుకొస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. కళ్యాణ లక్ష్మి పేరు మార్చి కళ్యాణ మస్తు గా మార్చాలని అనుకున్నాం.. అది భవిష్యత్ లో అమలు చేస్తామని అన్నారు. Also Read:US:…
MLC Kavitha : నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా నిలిపివేయడం, సీఎం రేవంత్ రెడ్డి తీరు, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను నిలిపివేయడం ముస్లిం సోదరుల హక్కులకు భంగం కలిగించే విషయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మతసామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఇచ్చే సహాయాన్ని…
మండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారు.. దీని గుర్తించి తమ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చైర్మన్ న్యూసెన్స్ చేయవద్దని కామెంట్ చేశారు. మండలి చైర్మన్‌గా న్యూసెన్స్ అనే పదం వాడారు.. దాన్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha: తెలంగాణ రాష్ట్ర సమస్యలకు సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై, అలాగే ఇతర సమస్యలపై ఆమె విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ పేగులు తెగేలా పోరాడిందని, అప్పటి కష్టం మరువలేనిదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొన్ని సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ పోరాటంలో కొంతమందికి…
తెలంగాణ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టిన కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు.
MLC Kavitha: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి.. ప్రజాస్వామ్యం ఓడిపోయింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపింది అన్నారు. పార్టీలపరంగా, సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయి.. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదు అని పేర్కొన్నారు.