అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మ జ్యోతిరావు బాపూలే విగ్రహ ప్రతిష్టాపన కోసం భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశామని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు బాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. పూలే విగ్రహం పెడితే బీసీలకు న్యాయం జరుగుతుందా…
అయోధ్యలో సోమవారం జరగనున్న శ్రీరాముని విగ్రహం ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత రాష్ట్ర సమితికి అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఆదివారం వెల్లడించారు. ఫలితంగా, ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం ఉండదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు బీజేపీ చెబుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని కవిత మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే, శ్రీరాముడు ఒక వ్యక్తికి లేదా సంస్థకు చెందినవాడు…
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఎమ్మెల్సీ కవిత కోరారు. సభా ప్రాంగణంలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పడం గొప్ప ఆదర్శమన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపు విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. కేసు తేలే వరకు హాజరుకాకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో గతేడాది మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. అయితే తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 16న ఈడీ ఎదుట హాజరు కావాలని కవితను ఆదేశించింది. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు కవితను 2022…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలోనూ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఒక్క సెకనులో రూ.6600 కోట్లు రాబట్టిన రతన్ టాటా కంపెనీ టాటా గ్రూప్ తన కంపెనీల త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడం ప్రారంభించింది. ఆభరణాలు, కళ్లద్దాలను విక్రయించే టైటాన్ కంపెనీ గ్రూప్ శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. దీని ప్రభావం ఈరోజు సోమవారం కంపెనీ షేర్లలో కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే, కంపెనీ షేర్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఒక్క సెకనులో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.6600 కోట్లు…
MLC Jeevan Reddy: బతుకమ్మ ఆడగానే హిందూ మతాన్ని గౌరవించినట్లా? అని ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు కుంగిపోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయింది.. తెలుసుకుంటామన్నారు. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ.. మేడిగడ్డ అది ఏమైనా టూరిస్ట్ స్పాటా అందరినీ తీసుకు వెళ్ళడానికి అని ప్రశ్నించారు?. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి కమిటీని తీసుకు వెళ్ళండని తెలిపారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కవిత…
MLC Kavitha: నెలసరి సెలవులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.