రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం భారత…
MLC Kavitha: యాదాద్రి జిల్లా భువనగిరిలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఇటీవల హాస్టల్ లో భవ్య, వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు బేల ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా, ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె హాజరుకావడం లేదని సుప్రీంకోర్టుకు తెలియజేయగా, తదుపరి తేదీ వరకు మధ్యంతర ఉపశమనం మంజూరు…
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు పులే గుర్తురాలేదా? ప్రజాభవన్ కు పూలే పేరు పెట్టాక గుర్తొచ్చిందా? అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు మహిళలకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వనప్పుడు.. కేసీఆర్ ను కవిత ఎందుకు ప్రశ్నించలేదు? అని ఆయన అన్నారు. పూలే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్ పరిపాలన చేశారని, మహిళలకు, బీసీలకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణత్మకంగ విమర్శలు…
తెలంగాణ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని కవిత అనడం విడ్డూరంగా ఉందని, కవిత కి ఈడి నోటీసులు వచ్చినప్పుదప్పుడల్లా కవిత కు మహిళా బిల్లు గుర్తుకొస్తుందని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.వేములవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని కవిత అనడం విడ్డూరంగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు కేసిఆర్ ఏ ఒక్కనాడు జ్యోతిరావు పూలే విగ్రహానికి కానీ, అంబేద్కర్…
హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ లో పలు అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు దేవాదాయ,పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆమెతో పాటు వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సవాల్ విసిరారు. మళ్ళీ నిజామాబాద్ లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు కొండా సురేఖ. నిన్న కవిత మాట్లాడుతూ ప్రభుత్వం పై…
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చెప్పినట్టు.. జనాభా ప్రాతిపదికన అవకాశాలు ఇచ్చేందుకు చూస్తున్నామని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాహుల్ గాంధీ మాటకు అనుగుణంగా బీసీ కుల జన గణన చేస్తున్నామన్నారు.
మధ్య ప్రదేశ్ లో పీడిత్ అధికార్ యాత్రను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు కాంగ్రెస్ ఎందుకు న్యాయం చేయలేదని, కేంద్రంలో బీసీలకు ప్రత్యే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీల కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు సీఎంగా ఉండి అన్ని వర్గాల…