MLC Kavitha: తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మ జ్యోతిరావు బాపూలే విగ్రహ ప్రతిష్టాపన కోసం భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశామని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు బాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. పూలే విగ్రహం పెడితే బీసీలకు న్యాయం జరుగుతుందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. బీసీల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి తరపున పోరాటం కొనసాగుతుందని కవిత తెలిపారు.
Bihar: బీహార్‌లో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం.. 28న సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం.!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఏప్రిల్ 11 వరకు పూలే విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశం ఎటు వైపు వెళ్తుందన్న చర్చ జరుపుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత జాగృతి ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం పోరాటం చేసి సాధించామన్నారు. బడుగుల కోసం పనిచేసిన ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని కవిత తెలిపారు.
అసెంబ్లీ అవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్ కు వినతి పత్రం అందించాం.. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్ధతు కూడగట్టడానికి లేఖ అందించామని పేర్కొన్నారు.
Jeevan Reddy: ఎమ్మెల్సీ కవిత కామెంట్స్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కౌంటర్..
విగ్రహం పెట్టడంతోనే విగ్రహం వస్తుందా.. అని కొంత మంది ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం భారత్ జాగృతి అనేక కార్యక్రమాలు చేపట్టింది.. బీసీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి పోరాటం చేస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సాధించామని అన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అనేక సంఘసంస్కర్తల జయంతులకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్కెట్ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు దక్కాయని తెలిపారు. గత పదేళ్లలో బీసీల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఆ పరంపర కొనసాగింపుగా ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల కోసం పనిచేయాలని ఒత్తిడి చేస్తామని తెలిపారు. తొలి అడుగుగా విగ్రహ సాధన కార్యక్రమాన్ని తీసుకున్నామని కవిత పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!