హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ లో పలు అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు దేవాదాయ,పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆమెతో పాటు వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సవాల్ విసిరారు. మళ్ళీ నిజామాబాద్ లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు కొండా సురేఖ. నిన్న కవిత మాట్లాడుతూ ప్రభుత్వం పై చాలా మాటలు మాట్లాడారని, ఇంద్రవెల్లి సభ పై కవిత ప్రభుత్వం డబ్బులు వినియోగించారాని మాట్లాడుతుందన్నారు కొండా సురేఖ. మలిదశ ఉద్యమకారులకు ఏమి చేస్తారు అని మాట్లాడుతుందని, ప్రియాంక గాంధీ తో రెండు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారు అని అంటుందన్నారు. హిమన్ష్ ఏ హోదా తో రాములవారికి పట్టు వస్త్రలు సమర్పించారని, గతంలో అమెరికాలో అంట్లు తోముకునే మీరు మాట్లాడుతారా…? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
లిక్కర్ రాణి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుతారంటూ ఆమె హెద్దెవ చేశారు. మమ్ములను విమర్శించే ముందు మీ విపులను చూసుకోవాలని, మమ్ములను విమర్శించే అర్హత మీకు లేదన్నారు కొండా సురేఖ. కవిత దమ్ముంటే నిజామాబాదు లో మళ్ళీ పోటీ చేసి గెలువాలని, జ్యోతి రావు పూలె మీద మాట్లాడుతుందన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలనుండి లేని ప్రేమ ఇప్పుడే వచ్చిందా అని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యే లు కబ్జాలకు, రౌడీయిజం కే పరిమితం అయ్యారని, గతంలో ఎం పనులు జరిగినాయో ఎమ్మెల్యే నిధులులను కూడా వాడుకోలేక పోయారు, సిఎంఎఫ్, సీడీఫ్ ఫండ్ లను వాడుకోలేకపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ పై సవతి తల్లి ప్రేమ చూపెట్టిందని, వరంగల్ ఎమ్మెల్యే 3కోట్ల నిధులు కూడా వాడుకోలేదన్నారు కొండా సురేఖ. వరంగల్ ను రెండో అతి పెద్ద సిటీగా తయారు చేస్తామని, వర్దన్నపేట లో నూతనంగా గ్రౌండ్ ను నిర్మిస్తామన్నారు. వరంగల్ బస్టాండ్ ను నూతనంగా నిర్మిస్తామని, ఆరు గ్యారెంటీ లు అమలు చేసే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు.