MLC Kavitha: నిజామాబాద్ నుంచి నేను పోటీ చేయాలా? లేదా? అన్నది బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుందని, నిజామాబాద్ నుంచి పోటీ చేయాలా లేదా చెప్పండి? అంటూ నిజామాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ గురించి మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి యూ టర్న్ ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు. రేవంత్ సర్కార్ పబ్లిసిటీ ఎక్కువ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నా మీద, జాగృతి పైన ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు నాపై చేశారని మండిపడ్డారు. పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. అధికారికంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్లి పార్టీ సభ పెట్టారని ఆరోపించారు. వేదిక, కుర్చీలు,లైట్లు పెట్టినందుకు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా? అన్నారు. మలి దశ ఉద్యమంలో అమరులైన అమరులకు కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. ప్రియాంక గాంధీ నీ ఏ హోదాలో రెండు గ్యారంటీ లకు అమలు చేయడానికి పిలుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీని ఎలా పిలుస్తారు? అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత? అని ప్రశ్నించారు.
Read also:Windfall Tax : ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రప్రభుత్వం
నిత్యం ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్, చార్టెడ్ ఫ్లైట్ లు వేసుకొని వెళ్తున్నారని అన్నారు. ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా? కేసీఅర్ కుటుంభం పై పడి ఏడిచారు రేవంత్ రెడ్డి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రేవంత్ కుటుంబ సభ్యులు ఏమి చేస్తారన్నది సమయం వచ్చినప్పుడు చెబుతామన్నారు. 23 మంది రాజకీయ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డి నోట ఏనాడూ జై తెలంగాణ నినాదం రాలేదని అన్నారు. ఒక్కనాడు కూడా అమరులకు నివాళులు అర్పించ లేదని మండిపడ్డారు. ఒక్క అమరవీరుల కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. మాది కుటుంబ పార్టీ అంటున్న రేవంత్, మొన్నటి ఎన్నికల్లో 22 కాంగ్రెస్ లోని కుటుంబాలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు? నిజామాబాద్ నుంచి నేను పోటీ చేయాలా ? లేదా ? అన్నది బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలా లేదా చెప్పండి అంటూ ప్రశ్నించారు. మేము పడగొట్టడం కాదు…ఖమ్మం ,నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలే కాళ్లు పట్టుకుని లాగుతారన్నారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇద్దామని రేవంత్ అనుకున్నారు…కానీ నల్గొండ నేతలు అడ్డుకున్నారు అన్నది అందరికీ తెలుసన్నారు.
Windfall Tax : ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రప్రభుత్వం