ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 23 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉంటారని రోస్ అవెన్యూ కోర్టు శనివారం తెలిపింది. ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ బీఆర్‌ఎస్ నాయకుడిని రిమాండ్‌కు తరలించాలని కోరుతూ ఈడీ చేసిన దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేశారు. కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని విచారణ సంస్థ కోరింది. అయితే, న్యాయమూర్తి ఆమెకు మార్చి 23 వరకు…
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. కేంద్రంలో ఉన్న బీజేపీనే కవిత అరెస్ట్‌కు కారణం అంటూ బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కవిత అరెస్ట్ పై రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ స్పందించారు. మద్యం కుంభకోణంలో కవితను అరెస్ట్ చేశారని, గత సంవత్సర కాలంగా దర్యాప్తు సంస్థలు అనేక ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో కూడా సగం మంది…
Revanth Reddy: కవిత..కేసీఆర్ కూతురు.. కూతురు ఇంటికి పోలీసుల వెళ్లి అరెస్ట్ చేస్తుంటే.. కవిత ఇంటికి తండ్రిగా రావాలి కదా? అని ప్రశ్నించారు. తండ్రిగా కాకుండా పార్టీ అధ్యక్షుడుగా నైనా వెళ్ళాలి కదా? అని ప్రశ్నించారు.
Aadi Srinivas: కవిత అరెస్ట్ లోక్ సభ ఎన్నికల కోసమే..ఇది బీజెపీ, బీఆర్ఎస్ డ్రామా అని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీజెపీ, బీఅర్ఎస్ రెండు ఒక్కటి కాదు అని చెప్పడానికి మాత్రమే అరెస్ట్ డ్రామా అన్నారు.
MLC Kavitha: తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత.
RS Praveen Kumar: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అరెస్టుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇవాళ ఉదయం మహిళా వైద్యుల బృందం ఇడి కేంద్ర కార్యాలయం పరివర్త్ భవన్‌కు వెళ్లి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
పార్టీ నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో ఏది పడితే అది మాట్లాడొద్దని సూచించారు. కవిత అరెస్ట్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించి కాదు... వ్యక్తిగతమైన ఇష్యూ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కవిత అరెస్ట్ గురించి ప్రెస్ మీట్ లు పెట్టొద్దని ఆదేశించారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అవినీతికి పాల్పడినందుకు ఆమె జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని... ఈ రోజు సోదరి వెళ్లింది... రేపు సోదరుడు వెళ్ళవచ్చు... ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళ్లవచ్చునని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు.