Kavitha Advocate: కోర్టు పరిధిలో ఉండగానే కవితకు మళ్లీ సమన్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha Advocate: ఎమ్మెల్సీ కవిత కేసులో కోర్టులో ప్రోసిడింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈడీకి కవిత పూర్తిగా సహకరించారని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. అయినా అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. కోర్టు పరిధిలో ఉండగా మళ్లీ సమ్మన్లు జారీ చేశారు. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కవిత వేసిన పిటిషన్ ఇంకా సుప్రీం కోర్టు లో పెండింగ్ లో ఉంది. కవిత కి వచ్చిన రిలీఫ్ ఇంకా అమలులో ఉందన్నారు. సుప్రీం కోరు ఫర్ధర్ అంటిల్ ఆర్డర్ ఇచ్చారా అని కవిత అడ్వకేట్ విక్రమ్ చౌదరిని జడ్జి ప్రశ్నించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని గతంలో సుప్రీం కోర్టు లో వేసిన పిటిషన్ లో స్పెషల్ గా మెన్షన్ చేశామని కవిత అడ్వకేట్ విక్రమ్ చౌదరి తెలిపారు. గతంలో నళిని చిదంబరం కి ఇచ్చిన రిలీఫ్ ఇవ్వాలని కొరామన్నారు. నళిని చిదంబరంకి ఇచ్చిన రిలీఫ్ కూడా కవితకి ఇవ్వాలని కోరామని తెలిపారు.
Read also: Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ కు ఏడాది పూర్తి.. నేడు ఆదిలాబాద్ కు భట్టి విక్రమార్క..!
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
మార్చి 15న 2024 (శుక్రవారం) నిన్న కూడా రిలీఫ్ కి సంభందించిన వాదనలు జరిగాయని, లైవ్ లో ఉన్న వాదనలు దేశమంతా చదివిందని తెలిపారు. ఇదే కేసును 19న విచారిస్తాము అని జడ్జి చెప్పారని తెలిపారు. ఈ సారి సమన్లు ఇస్తే 10 రోజులు నోటీసు ఇస్తాం అన్నారు. మధ్నాహ్నం 12.30 కి నిన్న కోర్టులో విచారణ ముగిసిందని, 30 నిమిషాల్లో కవిత ఇంటికి చేరుకున్నారని విక్రమ్ చౌదరి తెలిపారు. కాగా.. తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత. భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.
Read also: Jithender Reddy: హస్తం గూటికి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి.. ఆ వెంటనే కేబినెట్ హోదా..!
ఎమ్మెల్సీ కల్వకుంట్ల శుక్రవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో గంటల తరబడి సోదాల అనంతరం కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. వారిని సెంట్రల్ ఢిల్లీలోని ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి రాత్రి అక్కడే బస చేసినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈడీ అధికారులు కవితను శనివారం కోర్టు ముందు హాజరుపరిచారు. ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఎమ్మెల్సీ కవిత మీడియాకు తెలిపారు. దీనిపై కోర్టులో పోరాడతానని చెప్పారు. కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించింది. ఈడీ అధికారులు కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరనుంది.
MLC Kavitha: ఇది ఇల్లీగల్ అరెస్ట్.. కావాలనే ఇరికించారు..
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!