Aadi Srinivas: కవిత అరెస్ట్ లోక్ సభ ఎన్నికల కోసమే..ఇది బీజెపీ, బీఆర్ఎస్ డ్రామా అని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీజెపీ, బీఅర్ఎస్ రెండు ఒక్కటి కాదు అని చెప్పడానికి మాత్రమే అరెస్ట్ డ్రామా అన్నారు. లోక్ సభ ఎన్నికల కోసమే బీజెపీ, డీఅర్ఎస్ డ్రామా ఆడుతున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఆయన మాట్లాడుతూ.. గత 10 ఏళ్ల క్రితం నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. కరీంనగర్ ప్రతిమ మల్టిఫ్లెక్స్ లో దొరికిన 6 కోట్ల 67 లక్షల డబ్బు ఎవరివి.? అని ప్రశ్నించారు. ఎన్నికలు షెడ్యూల్ రాకముందే విచ్చల విడిగా డబ్బుల పంపిణీ చేసేందుకు బి అర్ ఎస్ నేతలు ప్లాన్ చేశారని మండిపడ్డారు. ఆర్టీసి స్థలంను లీజుకు తీసుకొని ప్రతిమ మల్టిఫ్లెక్సీ కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై అత్యంత సన్నిహితుడు వినోద్ కుమార్ ది ప్రతిమ అన్నారు. దీని పై కేసీఅర్ సమాధానం చెప్పాలన్నారు. కటన్ లో డబ్బులను ప్యాక్ చేశారని అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తిరస్కరించిన మళ్ళీ డబ్బులు పంపిణీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు తిరస్కరిస్తారని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాలం చెల్లింది అందులో మిగిలేది కేసీఅర్, కేటీఆర్, హరీష్, మాత్రమే అన్నారు.
Read also: Jithender Reddy: హస్తం గూటికి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి.. ఆ వెంటనే కేబినెట్ హోదా..!
10 ఏళ్ల పాటు రాష్ట్రం ను దోచుకున్న డబ్బులతో మళ్ళీ ఎంపి ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి కామధేనుగా మారిందన్నారు. బతుకమ్మను కవిత కనిపెట్టిందా? అని ప్రశ్నించారు. జ్యోతి రావు పూలే, అంబేడ్కర్, జయంతి, వర్థంతిలకు పూల మాలాలు వేయలేదు కేసీఆర్ అన్నారు. ఓ మహిళ అయి ఉండి మద్యం కుంభ కోణంలో ఇరుక్కోవడం సిగ్గు చేటన్నారు. 18 మంది సార్లు ప్రధాని ని కలిసి కేసీఅర్ ఏం సాధించారన్నారు. కేవలం కేటీఆర్, కవిత ల కోసమే కేసీఅర్ కలిసి ఉండవచ్చన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు. కవిత అరెస్ట్ ఓ డ్రామా.. బీజెపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటి కాదు అని చెప్పడానికి మాత్రమే అరెస్ట్ డ్రామా అన్నారు. లోక్ సభ ఎన్నికల కోసమే బీజెపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందన్నారు. బీజెపీ, బీఆర్ఎస్ డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. కవిత అరెస్ట్ అనేది గత ఏడాది అక్టోబర్ కావాల్సి ఉండే…బీజెపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు అనుకుంటున్నారని బీజెపీ నేతలే అన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో తమకు మిలకథ్ లేదని చెప్పడానికే బీజెపీ కవితను అరెస్ట్ చేసిందన్నారు. బీజెపీ, బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసిన ప్రజలు నమ్మలేరన్నారు. రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కి వస్తాయి, ఇప్పటికే సర్వేలు చెప్పాయన్నారు.
Kavitha Advocate: కోర్టు పరిధిలో ఉండగానే కవితకు మళ్లీ సమన్లు..!