MLC Kavitha: తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత. భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమె కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. కవిత కేసులో కోర్టులో ప్రోసిడింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈడీకి కవిత పూర్తిగా సహకరించారని ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. అయినా అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. కోర్టు పరిధిలో ఉండగా మళ్లీ సమ్మన్లు జారీ చేశారు. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కవిత వేసిన పిటిషన్ ఇంకా సుప్రీం కోర్టు లో పెండింగ్ లో ఉంది. కవిత కి వచ్చిన రిలీఫ్ ఇంకా అమలులో ఉంది.
సుప్రీం కోరు ఫర్ధర్ అంటిల్ ఆర్డర్ ఇచ్చారా అని కవిత అడ్వకేట్ విక్రమ్ చౌదరిని జడ్జి ప్రశ్నించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని గతంలో సుప్రీం కోర్టు లో వేసిన పిటిషన్ లో స్పెషల్ గా మెన్షన్ చేశామని కవిత అడ్వకేట్ విక్రమ్ చౌదరి తెలిపారు. గతంలో నళిని చిదంబరం కి ఇచ్చిన రిలీఫ్ ఇవ్వాలని కొరామన్నారు. నళిని చిదంబరంకి ఇచ్చిన రిలీఫ్ కూడా కవితకి ఇవ్వాలని కోరామని తెలిపారు. 15 మార్చి (శుక్రవారం) నిన్న కూడా రిలీఫ్ కి సంభందించిన వాదనలు జరిగాయని, లైవ్ లో ఉన్న వాదనలు దేశమంతా చదివిందని తెలిపారు. ఇదే కేసును 19 న విచారిస్తాము అని జడ్జి చెప్పారని తెలిపారు. ఈ సారి సమ్మన్ ఇస్తే 10 రోజులు నోటీసు ఇస్తాం అన్నారు. మధ్నాహ్నం 12.30 కి నిన్న కోర్టులో విచారణ ముగిసిందని, 30 నిమిషాల్లో కవిత ఇంటికి చేరుకున్నారని విక్రమ్ చౌదరి తెలిపారు.
Read also: Jithender Reddy: హస్తం గూటికి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి.. ఆ వెంటనే కేబినెట్ హోదా..!
భారత రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల శుక్రవారం అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో గంటల తరబడి సోదాల అనంతరం కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. వారిని సెంట్రల్ ఢిల్లీలోని ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి రాత్రి అక్కడే బస చేసినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈడీ అధికారులు కవితను శనివారం కోర్టు ముందు హాజరుపరిచారు. ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఎమ్మెల్సీ కవిత మీడియాకు తెలిపారు. దీనిపై కోర్టులో పోరాడతానని చెప్పారు. కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించింది. ఈడీ అధికారులు కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పేర్కొంది.
Amit Shah On Terrorism: త్వరలోనే జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు.. ఆ ఉగ్రవాద సంస్థలను నిషేధించాం..