Konda Vishweshwar Reddy : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి AIMIM, కాంగ్రెస్, BRS పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. BBP అనే కొత్త పదాన్ని విపక్షాలకు ఆయన బిరుదుగా ఉపయోగించారు. BBP అంటే భాయ్ భాయ్ కే పార్టీ, బాప్ బేటే కే పార్టీ, బాప్ భేటి కి పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ AIMIM, కాంగ్రెస్, BRSలకే సూచిస్తాయని ఎద్దేవా చేశారు.…
MLC Elections : కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టబద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం ముగిసింది. ఈనెల 27 న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. గత 15 రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించారు అభ్యర్థులు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. పట్టభద్రుల స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్య ట్రయాంగిల్ వార్ జరుగనుంది. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేశారు పార్టీ అగ్రనేతలు.. కాంగ్రెస్ అభ్యర్థికి…
MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ఇవాళ అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభంకానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 10వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులు మద్యం షాపులు మూతపడనున్నాయి.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ సాయంత్రం 4 గంటల నుంచి వైన్స్‌లు, బార్లు ఇతర మద్యం షాపులు మూసివేశారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు మద్యం షాపులు మూసివేశారు నిర్వహకులు..
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఈ రోజు విశాఖ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. అయితే, ఆ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు చంద్రబాబు.. కానీ, టీడీపీలో ఇంకా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పంచాయతీ తేలనట్టుగా తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గానే జరిగిందిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కోదాడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమేళన కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు.
గత ఆరు నెలలుగా తెలంగాణలో రూ. 4 వేల కోట్లు అక్రమంగా వసూలు చేసి, రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. పరకాలలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోనియా, ఖర్గే ఎంపిక చేశారని.. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
లిక్కర్ లో ప్రభుత్వ పాలసీ ఉంటది.. కానీ అనధికార పాలసీ ఉంటదా? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. "మద్యం అందుబాటులో లేకుంటే సేల్స్ తగ్గాలి. కానీ ఎందుకు పెరిగింది సేల్స్.