Thummala Nageswara Rao: సోనియా గాంధీ, ఖర్గే ఎంపిక చేసిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోనియా, ఖర్గే ఎంపిక చేశారని.. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడారు. ” పోరాటం చేసే సత్తా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉందని నిరూపిద్దాం. అభ్యర్థి ఎవరైనా సరే పార్టీ ఆదేశాలను అమలు చేసే కార్యకర్తలు, నాయకులు ఉండటం కాంగ్రెస్ పార్టీ అదృష్టం. అధికార పార్టీ బెదిరింపులకు, కేసులకు భయపడకుండా ఒంటరి పోరాటం చేసిన వ్యక్తి మల్లన్న. మూడు జిల్లాల్లో ఉన్న ఎంఎల్ఏ లు మెజారిటీ ఇస్తాం అంటున్నారు.. మన డోర్నకల్ నియోజకవర్గం ఎక్కువ ఇవ్వాలి.
మీరిచ్చిన మనో ధైర్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మా వంతు కృషి చేస్తాం” అని మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Baby Kidnap: వస్తువులు అమ్మే వారితో జాగ్రత్త.. ఇంట్లోకి ప్రవేశించి చిన్నారిని ఎత్తుకెళ్లిన దొంగ
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా రైతుల మనో ధైర్యం దెబ్బతీసే విధంగా మాట్లతున్నారని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. “అయినా సరే మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించాం. గతంలో 45 రోజుల్లో రైతులకు డబ్బులేశారు. మేము 4 రోజుల్లో వేస్తున్నాం. సన్న వడ్లకు బోనస్ ఇచ్చాం. దొడ్డు వడ్లు కు కూడా బోనస్ ఇస్తామని తెలియచేస్తున్న. మల్లన్నకు మద్దతు ఇవ్వాలి” అని పేర్కొన్నారు. మీరు ఎప్పటి లాగే గత ప్రభుత్వంను నిలదీసినట్లె తప్పు చేసిన ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్నను మంత్రి తుమ్మల కోరారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామచందర్ నాయక్, మంత్రి తుమ్మల, ఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!