MLC Elections: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఓటరు జాబితా సిద్ధమైంది. ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించారు. రాజ్యసభ సభ్యులు సహా 16 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో ఓటు ఉంటుంది. మొత్తం 838 మంది ఓటర్లున్నారు. ఇందులో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది ZPTCలు ఉన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు 97 మంది ఉన్నారు. 28 మంది నర్సీపట్నం కౌన్సిలర్లు, 25 మంది ఎలమంచిలి కౌన్సిలర్లు ఉన్నారు. ఖాళీలు పోను 822 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపట్నుంచి ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆగస్టు 30న విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
Read Also: Thangalaan : తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కూటమి నాయకత్వం విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తోంది. టీడీపీ నుంచి ఇద్దరి మాజీ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రంలోగా అభ్యర్థిపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.