పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గానే జరిగిందిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కోదాడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమేళన కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ హాజరై మాట్లాడారు. “విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది కేసీఆర్. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడినది బీజేపీ పార్టీ.. కానీ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం కొట్లాడింది బీజేపీ కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రెండవ స్థానం కోసమే ప్రయత్నం చేస్తుంది. 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్ని వర్గాల కోసం కొట్లాడింది బీజేపీ. మతపరమైన రిజర్వేషన్లకు మొదటి నుంచి బీజేపీ పూర్తిగా వ్యతిరేకం. పక్కా మేము రాముడి వారసులం. ప్రజల తరఫున కొట్లాడటానికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీకి ఓటేయమని విజ్ఞప్తి చేస్తున్నాం.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Moto G04s: మోటో నుండి రాబోతున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. వివరాలు ఇలా..
కాగా.. చౌటుప్పల్ మండలం కోయ్యలగూడెం వద్ద.. ఖమ్మం వెళ్తున్న బండి సంజయ్ కి బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ చరిష్మా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఎన్నికల గెలుపులో దోహదం చేస్తుందని తెలిపారు. సర్వే సంస్థలు ఊహించని ఫలితాలను ఎన్నికల్లో చూస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని.. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు.