Liquor Shops Closed: మందుబాబులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఏకంగా రెండు రోజుల పాటు మద్యం షాపులు పూర్తిగా మూతపడనున్నాయి.. తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సర్వం సిద్ధం అవుతోంది.. డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.. తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గతేడాది డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరగనుండగా.. 9వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. ఈ నేపథ్యంలో.. ఈ నెల 4, 5, 9 తేదీలలో సదరు నియోజకవర్గంలో సెలవు దినాలుగా ప్రకటించింది ప్రభుత్వం.. స్ధానిక సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్టుగా పేర్కొంది సర్కార్..
Read Also: Vitamin ‘D’ Deficiency: ‘విటమిన్ డి’ లోపం ఉంటే ఇవి తినండి.. మళ్లీ సమస్య రాదు..
ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులు మద్యం షాపులు మూతపడనున్నాయి.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ సాయంత్రం 4 గంటల నుంచి వైన్స్‌లు, బార్లు ఇతర మద్యం షాపులు మూసివేశారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు మద్యం షాపులు మూసివేశారు నిర్వహకులు.. ఎన్నికల దృష్ట్యా మద్యాన్ని విక్రయిస్తే చట్ట రీత్యా నేరమని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు..