MLA Quota MLC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠరేపిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.. అయితే, ఈ ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపిన అనురాధ 23 ఓట్లు సాధించి విజయం సాధించారు.. ఏడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏడుగురిని బరిలోకి దింపితే.. వైసీపీ అభ్యర్థి కోలా గురువులు మినహా మిగతా ఆరుగురు విజయం సాధించారు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలుగా మర్రి రాజశేఖర్,…
AP MLC Election Results: మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థికి ఓటమి తప్పలేదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి.. అయితే, ఎమ్మెల్యే కోటాలోని ఏడు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపగా..…
MLA Quota MLC Elections: ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.. గురువారం రోజు దీనికి సంబంధించిన పోలింగ్ నిర్వహించడంతో పాటు సాయంత్రం ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.. అయితే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. ఏపీ వైసీపీ ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టేసింది.. అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా..? అని జిల్లాల్లో ఆరా తీసింది.. ఎమ్మెల్యే కోటాలో…
MLCs Meets CM YS Jagan: తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ఎమ్మెల్సీలు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.. ఇక, ఇవాళ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ. రామచంద్రారెడ్డి, ఎ. మధుసూదన్.. తాజాగా జరిగిన టీచర్ల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఇద్దరు గెలుపుపొందారు. తమకు ఎన్నికలకు అవకాశం కల్పించి.. గెలుపునకు కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలుపుకోగా.. మరోవైపు..…
MLC Elections 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి.. ఈ నెల 23వ తేదీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే దీనిపై తమ ఎమ్మెల్యేలకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా విప్ జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని.. 23వ తేదీ పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలని విప్ జారీ చేసింది వైసీపీ.. అయితే, విప్ ధిక్కరిస్తే…
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలోనూ మూడు రోజుల పాటు అన్ని రకాల మద్యం షాపులు మూతపడనున్నాయి.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.. ఈనెల 11వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్స్‌లు మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించిన వైన్స్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ..…
Off The Record: మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న ఓటర్లు 29 వేల 7 వందల 20. బరిలో ఉన్న అభ్యర్థులు 21 మంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మరోసారి బరిలో దిగగా.. PRTU నుంచి ఆ సంఘం నేత చెన్నకేశవరెడ్డి పోటీ చేస్తున్నారు. అధికారపార్టీ BRS మద్దతు తనకే అని చెన్నకేశవరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన హర్షవర్దన్‌రెడ్డి సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ…
Sajjala Ramakrishna Reddy: రాజకీయ సాధికారత దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు.. విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసన సభ నుంచి 7 స్థానాలకు అభ్యర్థులను వైసీపీ తరఫున సీఎం జగన్ ఎంపిక చేశారు. మొత్తం 18 స్థానాలకు సోషల్ ఇంజనీరింగ్ అమలు చేశారు. 18 స్థానాల్లో 14 స్థానాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు…
GVL Narasimha Rao: ఈసారి మాకు అవకాశం ఇస్తే.. సమస్యలను ప్రధాన మంత్రికి చూపించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. విజయనగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యం.. అందుకే మా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ నుంచి పొట్టకూటి కోసం వలసలు వెళ్లిపోతున్నారన్న ఆయన..…