Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. తెలంగాణలోనూ మూడు రోజుల పాటు అన్ని రకాల మద్యం షాపులు మూతపడనున్నాయి.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.. ఈనెల 11వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్స్‌లు మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించిన వైన్స్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ.. కాగా ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరనున్న విషయం విదితమే..
Read Also: Beer can Treat Kidney Stones: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు మాయం..! సర్వేలో ఆసక్తికర అంశాలు..
మరోవైపు.. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అన్ని రకాల మద్యం షాపులు మూతపడనున్నాయి.. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు.. అంటే, ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఈ నెల 13వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. ఈ ఎన్నికల నేపథ్యంలోనే.. ప్రలోభాలకు తావివ్వకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుండగా.. 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.. ఇక, 16వ తేదీ కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లోనూ లిక్కర్ షాపులు క్లోజ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్.