MLCs Meets CM YS Jagan: తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ఎమ్మెల్సీలు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.. ఇక, ఇవాళ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ. రామచంద్రారెడ్డి, ఎ. మధుసూదన్.. తాజాగా జరిగిన టీచర్ల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఇద్దరు గెలుపుపొందారు. తమకు ఎన్నికలకు అవకాశం కల్పించి.. గెలుపునకు కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలుపుకోగా.. మరోవైపు.. విజయం సాధించినవారికి అభినందలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, పి.చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి.. ఇద్దరు టీచర్స్ ఎమ్మెల్సీలను గెలిచాం.. ఇదొక చరిత్ర అన్నారు.. టీచర్స్ సమల్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.. టీచర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. ఎన్నికల క్యాంపెయిన్ లో ఇచ్చిన రెండు హామీలను గెలవగానే సాధించాం అన్నారు.. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ను సర్వీసంతా వాడుకునేలా సీఎం నుంచి హామీ వచ్చింది.. మనసున్న మహరాజు జగన్ మోహన్ రెడ్డి.. ఇది మహిళా ప్రభుత్వం.. మహిళల సమస్యలను తీర్చే ప్రభుత్వం.. ఒక మహిళగా.. టీచర్స్ ఎమ్మెల్సీగా ఎంతో సంతోషిస్తున్నా.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీచర్స్ తరపున చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఇది నా జీవితంలో మర్చిపోని రోజు.. మేం ఏది అడిగినా వెంటనే స్పందించి తీరుస్తున్నారు అంటూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి.
ఇక, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎంవీ, రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఆశీస్సులతో ఎమ్మెల్సీగా గెలుపొందాం.. గెలిచిన తొలిరోజే ఇచ్చిన రెండు హామీలను నెరవేర్చాం.. ప్రైవేట్ స్కూల్స్ రెన్యువల్స్ మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారని.. భవిష్యత్తులో టీచర్లకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. మరోవైపు.. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. పిల్లలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.. నాడు – నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారు.. కొందరు చేస్తున్న కొన్ని పనుల వల్ల ప్రభుత్వానికి టీచర్లకు మధ్య గ్యాప్ ఏర్పడుతోందన్నారు. అయితే, మా సమస్యలు చెప్పగానే సీఎం జగన్ స్పాట్ లో జీవో జారీ చేయాలని చెప్పారని.. ఇలాంటి మంచి వ్యక్తి ఏపీకి సీఎంగా ఉండటం మన అదృష్టంగా అభివర్ణించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ భవిష్యత్తులో పరిష్కరిస్తాం.. మీ వెంటే మేముంటాం.. టీచర్లకు మేం అండగా నిలుస్తాం అన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి.