Sajjala Ramakrishna Reddy: రాజకీయ సాధికారత దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు.. విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసన సభ నుంచి 7 స్థానాలకు అభ్యర్థులను వైసీపీ తరఫున సీఎం జగన్ ఎంపిక చేశారు. మొత్తం 18 స్థానాలకు సోషల్ ఇంజనీరింగ్ అమలు చేశారు. 18 స్థానాల్లో 14 స్థానాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారని గుర్తుచేశారు. రాజకీయ సాధికారత దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని.. జగన్ విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నారని అభినందించారు.. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేశారు. శాసన మండలి నుంచి శాసన సభ వరకు కీలక పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు.
Read Also: Chitram Chudara: ‘చిత్రం చూడర’ అంటున్న వరుణ్ సందేశ్!
బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇన్ని పదవులు ఎందుకు ఇవ్వలేదు..? అంటూ నిలదీశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఇవ్వని వ్యక్తి.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయాలని సీఎం సంకల్పించారు. మహిళలకు సైతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా అడుగులు వేశారని.. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇదే సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయబోతున్నాం అని ప్రకటించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కాగా, ఏపీలో ఈ నెల 13వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుండగా.. 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు..