ఎందుకు బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి స్పీకర్ పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. అయితే.. రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు బీఏసీ సమావేశానికి పిలిచారని.. ఇవాళ బీజేపీకి ముగ్గురు సభ్యులున్నప్పుడు ఎందుకు పిలవడంలేదని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అంతమందిని ఈ అసెంబ్లీ పదవీ కాలంలోపే తెచ్చుకుంటామని రఘునందన్ రావు ఎద్దేవ చేశారు. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి మూడు రోజుల్లో సభను…
తన వ్యాఖ్యలు వేరుగా వక్రీకరించారని నేను ఎప్పటికి సీఎం జగన్‌కు వీర విధేయుడినని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మహాత్మాగాంధీ ఆత్మకథ పుస్తకం సీ.ఎస్. ఎన్వీ రమణ చేతులు మీదుగా ఆవిష్కరణ చేశామన్నారు. ఈ సందర్భం గా తను చేసిన ప్రసంగాన్ని కొద్ది మంది దురుద్దేశ్యం ఆపాదించి మహాత్ములు తన జీవితంలో చెప్పిన మాటలు వేరుగా ప్రకటించి తనేదో సీఎం జగన్ పై తను మాట్లాడినట్లు వక్రీకరించడం నాకు చాలా బాధ కల్గిందని ఆవేదన…
తాడికొండ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, తాడికొండ సమన్వయకర్తగా తనను పార్టీ అధిష్టానం నియమించిందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరులో ఎన్టీవీతో మాట్లాడిన ఆయన తాడికొండ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులపై స్పందించారు. తాడికొండ సమన్వయకర్తగా తనను పార్టీ అధిష్టానం నియమించిందని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయకత్వంలో అందరినీ కలుపుకుని పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని అన్నాడు. రెండు రోజుల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కలుస్తాఅని, ఎమ్మెల్యే శ్రీదేవి బాగా తెలిసిన వ్యక్తిఅని పేర్కొన్నారు. రెండు మూడు…
హైదరాబాద్‌లో నిన్న, మొన్న రెండు రోజుల పాటు భారీఎత్తున జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా విజయవంతమయ్యాయి. దీంతో తెలంగాణలోని కమలదళంలో అడుగడుగునా ఆ సంతోషం, ఆనందం కనిపిస్తోంది. అయితే ఈ సమావేశాల్లో వేదిక పైన వెనక (రెండో) వరుసలోని సరిగ్గా మధ్యలో కూర్చున్న పార్టీ యువ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాత్రం డల్‌గా ఉండిపోయారు. మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని భుజం తట్టి అభినందిస్తున్న సమయంలో…
సమస్యలపై ఫోన్ చేసినా వాటర్ వర్క్ అధికారులు ఫోన్ ఎత్తరని, పనిచేయడానికి కూడా ఇక్కడకు రారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ఎల్లారెడ్డి గూడ కీర్తి అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిగూడోలని కీర్తీ అపార్ట్‌మెంట్స్ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్న భూమిలో 8 అడుగుల లోపాలున్న సీవరేజ్ పైపులైన్ ధ్వంసమైందని,…
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనగానే రెక్కలు కట్టుకుని హస్తినలో వాలిపోయారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు. వరస మీటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన వారంతా.. తిరిగి వెళ్తూనే బోల్డన్ని కలలు కంటున్నారు. అందులో ప్రధానమైన స్వప్నం అసెంబ్లీలో అడుగుపెట్టడం. ఈ విషయంలో ఎవరికివారు ఊహాలోకంలో విహరించేస్తున్నారు. మీటింగ్స్‌లో పార్టీ పెద్దలు ఏం చెప్పారో.. వారి మాటలకు అర్థాలేంటో లోతైన అధ్యయనం చేయకుండానే కొత్త లెక్కలతో కుస్తీ పడుతున్నారట బీజేపీ కార్పొరేటర్లు. ప్రస్తుతం…
ఉత్తమ్ కుమార్‌రెడ్డి. ప్రస్తుతం నల్లగొండ ఎంపీ. గతంలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే. పీసీసీ మాజీ చీఫ్. ఎంపీగా కిక్కు ఇవ్వలేదో.. అసెంబ్లీనే ముద్దు అనుకుంటున్నారో కానీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు. హుజూర్‌నగర్‌ను విడిచిపెట్టేది లేదని.. ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ఇటీవలే ఓపెస్ స్టేట్‌మెంట్ ఇచ్చారు ఉత్తమ్. నల్లగొండ ఎంపీగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్ ఏం చేస్తారు అనేదానిపై పార్టీ కేడర్‌లో ఇన్నాళ్లూ కొంత సస్పెన్స్ ఉండేది. ఆ ఉత్కంఠకు ఆయన తెరదించేశారు.…
వెలంపల్లి శ్రీనివాస్. తాజా మాజీ మంత్రి. పదకొండు మందికి కేబినెట్‌లో తిరిగి చోటు దక్కినా.. ఆ జాబితాలో తాను లేకుండా పోయానని కొత్తలో కొంత బాధపడ్డారట వెలంపల్లి. ఇప్పుడా బాధ నెమ్మదిగా పోతున్నట్టే ఉంది. రోజువారీ కార్యక్రమాలు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్‌లోనూ టూర్ వేస్తూ.. మళ్లీ గెలుపొందే ప్రయత్నాలు చేస్తున్నారట. మినిస్టర్ పోస్ట్ పోయినా.. హ్యాపీగా ఉండటానికి చాలా కారణాలు చెబుతున్నారు ఆయన అనుచరులు. గతంలో ఆయన చేపట్టిన మంత్రి పదవి వల్ల నియోజకవర్గంలో…
యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించాక ధాన్యం కొనుగోలు కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. యాదాద్రి జిల్లాలో రైతుల నుంచి ఇప్పటి వరకు ఒక్క గింజ ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్ళ ను ప్రారంభించినా కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ యాసంగిలో సుమారు 11 లక్షల ఎకరాల్లో వరి…
హైదరాబాద్ రహదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో ఘోర ప్రమాదాల తర్వాత ఇష్టమొచ్చినట్టుగా స్టిక్కర్లు వేసుకుని తిరిగేవారిపై చర్యలు చేపట్టారు. వీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెస్, అడ్వకేట్ల పేరుతో స్టిక్కర్లు అంటించినవారు తప్పనసరిగా సరైన గుర్తింపు కార్డులు తమ వద్ద ఉంచుకోవాలన్నారు పోలీసులు. లేదంటే సంబంధిత వెహికల్ ని సీజ్ చేస్తామన్నారు. కారులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఈ కారు యజమాని ఆర్సీ పేపర్లు, డ్రైవింగ్ లైసెన్సులు, బ్లాక్ స్టిక్కరింగ్ నిరోధానికి చర్యలు చేపట్టారు. కారు…