తాడికొండ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, తాడికొండ సమన్వయకర్తగా తనను పార్టీ అధిష్టానం నియమించిందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరులో ఎన్టీవీతో మాట్లాడిన ఆయన తాడికొండ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులపై స్పందించారు. తాడికొండ సమన్వయకర్తగా తనను పార్టీ అధిష్టానం నియమించిందని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయకత్వంలో అందరినీ కలుపుకుని పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని అన్నాడు. రెండు రోజుల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కలుస్తాఅని, ఎమ్మెల్యే శ్రీదేవి బాగా తెలిసిన వ్యక్తిఅని పేర్కొన్నారు. రెండు మూడు సమావేశాలతో అంతా సర్దుకుంటుందని తెలిపారు. పార్టీలో విబేధాలు లేవు, కానీ.. ఇప్పుడు మాట్లాడేవారు కూడా మా పార్టీవారే అని సంచళన వ్యాఖ్యలు తెలిపారు.
నిన్న మాట్లాడినవారిలో కొంతమంది వచ్చి కలిశారని, ప్లీనరీ తర్వాత పార్టీ పటిష్టంపై సీఎం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. త్వరలో సీఎం జగన్ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటారని వ్యాక్యానించారు. తనపై మాట్లాడేవారు నన్ను కలిస్తే క్లారిటీ ఇచ్చేవాడినని అన్నారు. వివాదాలకు తావేలేదని, తాడికొండనుంచి పోటీపై ఇప్పటివరకూ చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తనకున్న పరిచయాలతో పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే.. తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై అసంతృప్తి పెరిగిందని గ్రహించిన పార్టీ హైకమాండ్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించింది. రానున్న ఎన్నికల్లో డొక్కాకు టిక్కెట్ ఇస్తారని అప్పుడే నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభమయింది. అయితే.. ఉండవల్లి శ్రీదేవికి టిక్కెట్ రాదని వారు పెద్దయెత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈవ్యవహారంపై ఉండవల్లి శ్రీదేవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.