నచ్చిన నేతకు నీరాజనం పలికే జనాలు.. తేడా వస్తే అదేస్థాయిలో నిలదీస్తారు. ఆ ఎమ్మెల్యే విషయంలోనూ అదే జరిగింది. ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో చర్చల్లోకి వచ్చారు ఆ అధికారపార్టీ శాసనసభ్యుడు. ఎవరా ఎమ్మెల్యే? ప్రజలు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? ఎమ్మెల్యేకు షాక్ ఇస్తున్న జనం?టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయాల్లో రోజుకో రకంగా మారుతుంది. అలాంటి పరిస్థితినే చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్యగౌడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నారట. సొంత పార్టీలోనే దీనిపై జోరుగా…
జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అధిష్టానానికి లేఖరాసి.. ఇక తాను కాంగ్రెస్ గుంపులో లేనని పేర్కొన్న ఆయనను సముదాయించడానికి సీనియర్లు రంగంలోకి దిగారు.. జగ్గారెడ్డి రాజీనామా చేయకుండా సముదాయించామని, ఆయన లేవనెత్తిన అంశాలపై అధిష్టానంతో మాట్లాడుతామని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.. జగ్గారెడ్డికి కొన్ని ఇబ్బందులున్నాయని, తమ దృష్టికి తెచ్చారని తెలిపిన ఆ నేతు.. జగ్గారెడ్డి కార్యకర్తల సమావేశానికి రాజీనామాకు సంబంధం…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది.. ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గోవాలో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. బీజేపీ షాకిస్తూ.. రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో రాజీనామా చేశారు.. మరో ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. కలంగుటే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు…
ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టాగా ఉన్న ఇంటి ఆస్తిని ఈ పథకంతో స్థిరాస్తిగా మారుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రాష్ట్రంలోని లక్షలాది మందికి ఉపయోగపడుతుందని, అయితే, ఈపథకాన్ని టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించాలని చూస్తుందని ద్వారంపూడి విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాజీ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని విమర్శించారు. Read:…
నోటు అనగానే మరకు దానిపై మహాత్మగాంధీ బొమ్మ గుర్తుకు వస్తుంది. గాంధీ బొమ్మ లేకుంటే ఆ నోటు చెల్లుబాటు కాదు. అయితే, ఇప్పుడు ఆ గాంధీ బొమ్మను తొలగించాలని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయంపై ప్రధానికి లేఖ కూడా రాశారు. రూ.2000, రూ.500 నోట్లను అవినీతితో పాటుగా బార్లలోనూ వినియోగిస్తున్నారని, అలా ఉపయోగించే వాటిపై గాంధీ మహాత్ముడి బొమ్మ ఉండడం మంచిది కాదని లేఖలో పేర్కొన్నారు.…
బీజేపీపై ఆర్మూర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ దేశంలో భారతీయ జనకంటక పార్టీగా మారిందని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ వరసగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతోందని విమర్శించారు. మోడీపాలనకు వ్యతిరేకంగా బిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో రాణిస్తోందని, క్రీడలను, క్రీడాకారులను సీఎం కేసీఆర్…
పంజాబ్ కాంగ్రెస్ సర్కార్‌లో సంక్షోభం మరోసారి తెరపైకి వచ్చింది.. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిన అధిష్టానం.. సీఎం అమరీందర్‌సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్ మధ్య వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది.. కానీ, ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.. అధిష్టానం సిద్ధూకి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి.. కొంత శాంతింపజేసినా.. అమరీందర్ సింగ్ ను మాత్రం సంతృప్తి పరచలేకపోయింది.. కానీ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడేకొద్దీ అక్కడ అసమ్మతి తీవ్రస్థాయికి చేరుతోంది. అయితే, ఈ నేపథ్యంలో…
ఎమ్మెల్యేలకు తమ ప్రాంతంలోని సమస్యలు చెప్పుకుంటూ ప్రజల నుంచి వినతి పత్రాలు వస్తుంటాయి. ఆ పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే, మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతేకు ఓ యువకుడి నుంచి విచిత్రమైన లేఖ వచ్చింది. చంద్రాపూర్ ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, కాని తనకు ఒక్క అమ్మాయి కూడా పడటం లేదని, ఎంత ప్రయత్నించినా తనకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేరని, జులాయిగా తిరిగే వాళ్లకు, తాగుబోతులకు కూడా గర్ల్‌ఫ్రెండ్స్…
కర్ణాటకలో రాజకీయాలో మరోసారి రచ్చ చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే, కాంగ్రెస్ నుంచి పలువులు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో సంకీర్ణప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిని రెండేళ్ల తరువాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పటెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ మారేందుకు బీజేపీ పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వజూపారని, కానీ తాను వాటిని…