Danam Nagender: దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లు ఆపి చూడాలని మా సీఎం సవాల్ విసిరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danam Nagender: దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లు ఆపి చూడాలని మా సీఎం సవాల్ విసిరారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలన బ్రిటీష్ వారి పరిపాలనలా ఉందని టీఆర్ఎస్ విమర్శించారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బూచిలా చూపిస్తూ, బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లు ఆపి చూడాలని మా సీఎం సవాల్ విసిరారని దానం నాగేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ విమోచన దినోత్సవం పేరుతో కార్యక్రమాలు చేసిందని మండిపడ్డారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుండి నాయకులను తెచ్చిందని ఆరోపించారు.. అమిత్ షా ను ఒక బూచిల చూపిస్తూ బీజేపీ రాజకీయాలు చేయడం సహించారని నేరం అన్నారు. ఇక మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కు అసలు తెలంగాణ గురించి ఏం తెలుసు? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నాయకులు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పరు అని దానం నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్బంగా.. గిరిజనులకు 10 రిజర్వేషన్లను అమలు చేస్తామని, వారం రోజుల్లోనే జీవో వస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఆమోదించినా, లేకున్నా, తాము మాత్రం గిరిజన రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని తెగేసి చెప్పారు. సెప్టెంబర్ 17న ఆదివాసీ, బంజారా భవన్‌లను సీఎం కేసీఆర్ ప్రారంభించి, ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక గిరిజనుల రిజర్వేషన్‌ను 10శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా, ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు. ఇన్నిరోజులు కేంద్రానికి మొరపెట్టుకొని, విసిగిపోయామని ఓపిక లేదని వారం రోజుల్లోనే రిజర్వేషన్ల జీవోను జారీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. గిరిజనుల జీవోను గౌరవించి అమలు చేస్తారా? లేకుంటే.. దానిని ఉరి తాడు చేసుకుంటారా? అని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.
వావ్.. ఇది చూశారా.. సన్ గ్లాసెస్ కమ్ ఇయర్‌ఫోన్స్..
Also Read
- Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
- Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
- Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..