సత్యవేడు పేరు వింటేనే... టీడీపీలో షేకవుతోందట. ఈ నియోజకవర్గంలోని వ్యవహారాలను చూసి... జిల్లా నేతలతో పాటు... పార్టీ పెద్దలు సైతం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన కోనేటి ఆదిమూలంకు పార్టీ టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. ఇష్టం లేకపోయినా.... అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నేతలంతా కలిసి ఆయన్ని గెలిపించుకున్నారు.
సత్యవేడులో అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన...? ఒక ఎమ్మెల్యేనే పక్కనపెట్టి మీరే పనులు చేసుకుంటారా..? అని ప్రశ్నించారు.. ఒకరి కో-ఆర్డినేటర్, మరొకరు పరిశీలకుడు అంటారు.. ఎంతమంది పెత్తనం చెలాయిస్తారు సత్యవేడుపై అంటూ ఫైర్ అయ్యారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో పైకి కనిపించనిది ఏదేదో జరిగిపోతోందా? గ్రూప్‌వార్ లిటరల్‌గా తెలుగుదేశం పార్టీ పరువును రోడ్డుకీడుస్తోందా? అంటే.. ఎస్....పరిణామ క్రమం అలాగే కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. సీనియర్ దళిత నేతగా పేరున్న కోనేటి ఆదిమూలంను ఏరికోరి పార్టీలోకి రప్పించుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు టిక్కెట్ ఇచ్చింది అధిష్టానం.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు ఓ కీలక కేసులో తీర్పు వెలువరించడంతో పాటు.. పలు కీలక పిటిషన్లపై విచారణ చేపట్టనుంది.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు..
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఆరోపించింది. తనను బెదిరించి 3 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ వెల్లడించింది. ఇద్దరం కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నామని, పార్టీ కార్యక్రమాల్లో పరిచయమై నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడని బాధిత మహిళ పేర్కొంది. ఎమ్మెల్యే ఆదిమూలం నాకు పదేపదే ఫోన్ చేసేవాడని, లైంగిక కోరిక తీర్చకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలని…
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే.. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారట.. తిరుపతి జిల్లా సత్యవేడు (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీకి చెందిన శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై తీవ్ర స్దాయిలో విమర్శలు చేశారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. తనకు తెలియకుండా సత్యవేడు నేతలతో సమావేశం పెట్టడం, కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే నగరి తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజక వర్గ నేతలతో సమావేశాన్ని ఆయన ఇంటిలో పెట్టాగలరా అని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి రిజర్వడ్ నియోజకవర్గాలంటే అంతా చిన్నచూపా అని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కంటే సీనియర్ లీడర్ తానని.. తనలా…