MLA Koneti Adimulam: సొంత పార్టీ నేతలపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ ఫిర్యాదు చేసిన తర్వాత.. ఆ ఎపిసోడ్ ఎన్నో మలుపులు తిరిగింది.. అయితే, అప్పటి నుంచి పార్టీ ఆయన్ని పక్కకు పెట్టేసిందనే విమర్శలు ఉన్నాయి.. ఈ విషయంపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఈ రోజు సత్యవేడులో అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన…? ఒక ఎమ్మెల్యేనే పక్కనపెట్టి మీరే పనులు చేసుకుంటారా..? అని ప్రశ్నించారు.. ఒకరి కో-ఆర్డినేటర్, మరొకరు పరిశీలకుడు అంటారు.. ఎంతమంది పెత్తనం చెలాయిస్తారు సత్యవేడుపై అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: Andhra King Taluka: రామ్ రాసిన పాటని అనిరుధ్ పాడితే?
ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న నాకు కాకుండా బయట వ్యక్తులకు ఎస్పీ ఎలా సెల్యూట్ చేస్తారు…? అని ప్రశ్నించారు ఆదిమూలం.. శంకర్ రెడ్డికి నాకు మధ్య ఎంతో అనుబంధ ఉంది.. కానీ, రిజర్వ్ నియోజవర్గంలో ఇలా చేయమని సీఎం చంద్రబాబు ఎప్పుడు చెప్పలేదన్నారు.. కొంతమంది గొర్రెల్లాగా ఎవరు వెంటపడితే వారి వెంట వెళ్తున్నారు.. అయితే, గ్రూపు రాజకీయాలు, కుల రాజకీయాలు నియోజకవర్గంలో చేయొద్దని సూచించారు.. కనీసం, నన్ను కాకపోయినా.. నా కొడుకును అయినా పార్టీ కార్యక్రమాలకు తీసుకు వెళ్లవచ్చు కదా? అని ప్రశ్నించారు.. మేమందరం కలిసికట్టుగానే ఉన్నాం.. కానీ, కొందరు మాత్రమే మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారని మండిపడ్డారు సత్యవేడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం..