AP High Court: నేడు ఏపీ హైకోర్టులో కీలక కేసుల విచారణ..
- నేడు ఏపీ హైకోర్టులో కీలక కేసుల విచారణ..
- సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో తీర్పు ఇవ్వనున్న కోర్టు..
- పలు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు ఓ కీలక కేసులో తీర్పు వెలువరించడంతో పాటు.. పలు కీలక పిటిషన్లపై విచారణ చేపట్టనుంది.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో నేడు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు.. కాగా, సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు తేలిపోయింది. తన కేసు కొట్టి వేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు అయిన వరలక్ష్మి కూడా ఇంప్లీడ్ అయి తాము రాజీకీ వచ్చామని కేసు అవసరం లేదని చెప్పారు. దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. అయితే ఈ కేసులో ఈ రోజు తీర్పు ఇవ్వనుంది హైకోర్టు..
Read Also: Haryana Elections : నేడు హర్యానాలో ఎన్నికల పోరులోకి దిగనున్న మోదీ… గోహనాలో ర్యాలీ
Also Read
మరోవైపు.. సంచలనం సృష్టించిన ముంబై సినీ నటి జిత్వానీ కేసులోనూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. హైకోర్టులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.. జిత్వానీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు గున్ని.. ఆ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది.. ఇక, ఏపీ హైకోర్టులో జోగి రమేష్ బాబాయ్ జోగి వేంకటేశ్వర రావు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏ1గా ఉన్న జోగి వేంకటేశ్వర రావు వేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేయనుంది హైకోర్టు.. అయితే, జోగి రాజీవ్ ను అరెస్టు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్నారు జోగి వేంకటేశ్వర రావు.. మరోవైపు.. హైకోర్టులో సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ, సీఐడీ కేసుల్లో నిందితుడుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వర రావు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు.. ఆ పిటిషన్లపై కూడా నేడు విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు..
తాజావార్తలు
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!