Harish rao: మూడోసారి కూడా తెలంగాణ సీఎం కేసీఆరే అని, కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమావేశంలోమంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు.
Off The Record: మిర్యాలగూడ కాంగ్రెస్‌లో చాలాకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు పార్టీ కార్యాలయంలోనే ఘర్షణ పడ్డారు. పరస్పరం పోలీస్‌లకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇది అప్పటికప్పుడు క్షణికావేశంలో జరిగిన గొడవగా కార్యకర్తలు భావించడం లేదట. కొంత కాలంగా లక్ష్మారెడ్డి మిర్యాలగూడ టికెట్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. తన సొంత ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ…
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిర్యాలగూడలో తనకున్న ప్రతికూల పరిస్థితులపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కిన ఆయన.. 2018లో టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు స్కెచ్ వేస్తున్నారు భాస్కరరావు. అయితే రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక.. నియోజకవర్గంలో ఆయనకు ఇంటా బయటా రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. కొత్తలో వాటిని భాస్కరరావు లైట్ తీసుకున్నా.. హ్యాట్రిక్ విజయానికి…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం. ఇక్కడి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. టీఆర్ఎస్ నుంచి వరసగా రెండోసారి ఎమ్మెల్యే. 2014లో గెలిచిన తర్వాత పెద్దగా వివాదాలు రాకపోయినా.. 2018లో గెలిచాక మాత్రం పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయని కేడర్ చెవులు కొరుక్కుంటోంది. టీఆర్ఎస్ కేడర్‌తోపాటు.. ప్రజలకు ఎమ్మెల్యే దూరం అయ్యారని టాక్ నడుస్తోంది. సొంత పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా భాస్కరరావు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి టర్మ్‌లో భాస్కరరావుకు తోడుగా ఆయన…
నల్లగొండలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా సాగుతోంది. అయితే మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశంలో కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఫ్లెక్సీపై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి ఎల్ అర్ ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు అభ్యంతరం తెలిపారు. దీంతో సీనియర్ నేత జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడారు. మిర్యాలగూడ నుండే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కాపాడాలి. రాష్టంలో కాంగ్రెస్ ప్రతిష్టను…