Hijra’s Fighting: పోలీస్ స్టేషన్ లో హిజ్రాల వీరంగం.. వసూళ్ల విషయంలో ఘర్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయి.. పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా దారుణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించగా.. దీంతో ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం పీఎస్ కు వచ్చింది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో పోలీస్ స్టేషన్ లోనే తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.
Read Also: Kethireddy Pedda Reddy: జేసీ ప్రభాకర్‌కి కేతిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Also Read
ఇక, పోలీస్ స్టేషన్‌లోనే రెండు వర్గాలకు చెందిన హిజ్రాలు కొట్టుకున్నారు. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.. దీంతో ఏం చేయాలో అర్థంకాక పోలీసులు వారి గొడవను చూస్తు ఉండిపోయారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజ్రాలు తన్నుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. వసూళ్ల విషయంలోనే ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తుంది. దీంతో రెండు వర్గాల హిజ్రాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇక.. ఈ రెండు వర్గాల హిజ్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
Read Also: Israel: న్యాయ సంస్కరణలకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం
అయితే.. రెండు వర్గాల కు చెందిన హిజ్రాలు వసూళ్లు చేసుకునే విషయంలో ఈ గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. తమ పరిధిలోకి మరో వర్గం వచ్చి వసూళ్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మరో వర్గం హిజ్రాలు అలాంటిదేమి లేదని.. కావాలనే తమపై కక్షపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఇంకొ వర్గం హిజ్రాలు అంటున్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!