మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి సొంత గన్‌మ్యాన్ బుల్లెట్ యూరియా రూపంలో గట్టిగానే దిగిందట. గన్‌మ్యాన్ నాగు నాయక్ యూరియా లోడ్‌ను పక్కాదారి పట్టించిన వ్యవహారం... తిరిగి తిరిగి ఎమ్మెల్యేకు మెడకు చుట్టుకున్నట్టు తెలుస్తోంది. అది ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారడంతో...బీఎల్‌ఆర్ మీద అధికార పార్టీ కీలక నేతలు బాగా సీరియస్ అయినట్టు సమాచారం. ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసి.... తన ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే బత్తుల ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారట. చిన్న నిర్లక్ష్యానికి..…
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దూకుడు, ఆయన వ్యవహార శైలి ఏకంగా సొంత హస్తం పార్టీ క్యాడర్‌నే కలవర పెడుతోందట. అంతా నా ఇష్టం.. నా మాటే శాసనం అన్నట్టుగా ఆయన పోకడ ఉందని అంటున్నారు. నేను చెప్పినట్టే అంతా నడవాలి.. నా మాటే వినాలి.. అన్నీ నేనే అన్ని సెట్ చేస్తానంటూ..
Crime News : మోసాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. రోజుకొక కొత్త రూపంలో మోసాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నమ్మిన వ్యక్తులే ఊహించని రీతిలో మోసం చేస్తున్నారు. తాజాగా మిర్యాలగూడలో అటవీశాఖ ఉద్యోగిని మోసం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అటవీశాఖ విశ్రాంత ఉద్యోగిని బ్లాక్ బెయిల్ చేసి ఏకంగా రూ.46లక్షలు వసూలు చేశాడు ఓ వ్యక్తి. గతంలో విశ్రాంత ఉద్యోగి త్రిపురాం మండలం రాగడప బీట్ అటవీశాఖలో…
Final Judgement: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే యువకుడిని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో…
ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ అన్నారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
నల్గొండ జిల్లా మిర్యాల గూడలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఈదులగూడ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా.. మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్లు విలువ చేసే 13 కిలోల బంగారం పట్టుకున్నారు. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.. కాగా.. బంగారం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.…
Minister KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రచారం కింద బీఆర్‌ఎస్ మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్లోనే హిజ్రాలు రెచ్చిపోయి.. పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా దారుణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించగా.. దీంతో ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం పీఎస్ కు వచ్చింది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో పోలీస్ స్టేషన్ లోనే తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.