ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్ షాపుకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. అనుమతి తీసుకుని సమావేశానికి పలువురు నేతలు హాజరుకాలేదు. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి సమావేశానికి వచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వర్క్‌షాపును ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమం. దాదాపు 8 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఒక్కో…
టీడీపీ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. మహానాడు ఒక మహా స్మశానం. ఎన్టీఆర్ బతికి ఉంటే ఇవాళ వందో పుట్టినరోజు చేసుకుని ఉండేవారు. 73 ఏళ్ళ వయసులోనే ఆయనను హత్య చేసి ఇవాళ మహానాడు చేస్తున్నారు. ఆయన ఆత్మక్షోభ ప్రభావాన్ని చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి. పప్పునాయుడు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని పదవి దించే పరిస్థితి ఉంటుందా? మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేస్తారు అన్నాడంటే చంద్రబాబు అవగాహన లేని నాయకుడు అని…
సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట డివిజన్ బండ మైసమ్మనగర్‌లో రూ.27.20 కోట్ల వ్యయంతో 310 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. వాటిని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పేదలు ఆత్మ గౌరవంతో ఉండేలా ఇండ్లు నిర్మించాలని కలలు కన్నారని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కలలను సనత్ నగర్…
దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు అందుకున్న రణిల్ విక్రమసింఘే కీలక నిర్ణయం తీసుకున్నారు.. తన మంత్రివర్గంలోకి నలుగురిని చేర్చుకున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం కోసం ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేశారు. ఆయన మంత్రివర్గంలో గరిష్ఠంగా 20 మంది మంత్రులు మాత్రమే ఉంటారని తెలుస్తోంది. పార్లమెంటులో ఆయన మెజారిటీని నిరూపించుకోవడానికి అధికార పార్టీ అయిన శ్రీలంక పొదుజన పెరమున సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మొత్తంగా.. జీఎల్ పెయిరిస్, దినేశ్ గుణవర్ధనే,…
వేసవి వచ్చేసింది. మండే ఎండలకు తోడు నీటి కొరత జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో…గుక్కెడు నీటి కోసం జనం అలాడిపోతున్నారు. తాగునీటి సరఫరాలో నీటివనరులు, లేదా సాంకేతిక సమస్యలు ఉంటే ట్యాంకర్లతో అయినా సరఫరా చేస్తారు. ఈ నియోజకర్గంలో ఆధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తాగునీరు సరఫరా కాకపోవడంతో క్యాను నీటికి 15 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఆలూరు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ…
రాజకీయాల్లో పదవులు, ప్రాధాన్యత ఉంటేనే నేతలు పార్టీతో ఉంటారు..దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.పదవులు దక్కకపోతే, పార్టీలు మారటానికి, జెండాలు, కండువాలు మార్చటానికి నేతలు ఎప్పుడూ వెనుకాడరు. అధికార పార్టీలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, నేతల చూపు ఎప్పుడూ కుర్చీపైనే ఉంటుంది.అధికార టిఆర్ఎస్ పార్టీలో ఈ మధ్య ఇలాంటి ఆసక్తికరమైన చర్చ ఒకటి మొదలైందట. టిఆర్ఎస్ లో కొంతకాలం మంత్రులుగా ఉండి, ఇప్పుడు మాజీలైన వారున్నారు..అదే సమయంలో ఒకప్పుడు చక్రం తిప్పి, ఇతర పార్టీల్లో ఓ స్థాయిలో…