ఏపీ సీఎం జగన్ మంత్రుల్ని జిల్లాలకు ఇన్ ఛార్జిలుగా నియమించాక.. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల జాబితాను మంగళవారం ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా వెల్లడించారు. మంత్రులుగా అవకాశం ఇవ్వలేని వారికి జిల్లా అధ్యక్షులుగా నియమించారు. కొందరు మాజీ మంత్రులకు జిల్లా అధ్యక్షుల బాధ్యతలు అప్పగించారు. చోటు కల్పించ లేని ఆశావహులకూ జిల్లా అధ్యక్ష బాధ్యతల అప్పగించడం ద్వారా వారిలోని అసమ్మతిని తగ్గించే ప్రయత్నం చేసింది పార్టీ. 11…
మంత్రి పదవి రాలేదని ఏపీలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మంత్రి పదవి రాకపోవడంపై పిన్నెల్లిని బుజ్జగించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం ఆయన మాట్లాడారు. మొదట్నుంచీ జగన్ కోసం, పార్టీకోసం పనిచేశాం. ఇప్పటివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఒకసారి వైఎస్, మూడు సార్లు జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యే అయ్యా. సామాజిక…
మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవుల కోసం తాము ముఖ్యమంత్రి జగన్ చుట్టూ తిరగడం లేదన్నారు. నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు కదా అన్నారు. బాబులా పదవుల కోసం స్వంతమామకు వెన్నుపోటు పొడిచారన్నారు. మేం పార్టీకోసం పనిచేస్తాం అన్నారు. కేబినెట్లో తమను తీసేశారంటే.. నా మనుషులు.. వీరిని తీసినా ఏం ప్రాబ్లం వుండదని భావించారన్నారు. సింపతీ కబుర్లకు ప్రలోభాలకు గురికావద్దన్నారు కొడాలి నాని. ఆయన వెంట సైనికుడిలా నిలబడతాం. జగన్ నిర్ణయం వెనుక…
ఏపీ మంత్రివర్గం కూర్పుపై సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆదివారం కూడా కొనసాగనుంది. రేపు మరోసారి సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మధ్యాహ్నం 12 గంటలకు వీరిద్దరూ భేటీ కానున్నారు. ఇవాళే తుది జాబితా సిద్ధం చేసే దిశగా కసరత్తు ప్రారంభం అయినా ఇంకా కొలిక్కిరాలేదని తెలుస్తోంది. సీఎం, సజ్జల వరుస భేటీల పై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.…
మంత్రులు.. ఎమ్మెల్యేలు రోడ్లపైకి వస్తుంటే.. అధికారపార్టీ కేడర్ మాత్రం వారికి షాక్ ఇస్తోంది. నియోజకవర్గాలకు బాస్‌లమని చెప్పుకొంటున్న శాసనసభ్యులకు తాజా పరిస్థితులు మింగుడు పడటం లేదట. ఇటీవల జరిగిన పరిణామాలు MLAలను మరింత కలవర పెడుతున్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారపార్టీలో ఒక్కటే గుసగుసలు. భారీ ఏర్పాట్లు చేసినా కేడర్ డుమ్మా..!ధాన్యం కొనుగోళ్లుపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది అధికార టీఆర్ఎస్. ఇంఛార్జ్ మంత్రి…
కేంద్రంపై మరోసారి పోరుకు సిద్ధమైంది టీఆర్‌ఎస్ పార్టీ.. టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై చర్చించనున్నారు. యాసంగి ధాన్యాన్ని వందశాతం కేంద్రం ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడిచేసేందుకు చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. Read Also:…
హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ వల్ల హైదరాబాద్ ఖ్యాతి మరింతగా పెరుగుతుందన్నారు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. గచ్చిబౌలి లో IAMC నిర్మాణానికి భూమిపూజ చేశారు చీఫ్ జస్టిస్ ఎన్.వీ. రమణ. భారతదేశంలో మొదటి IAMC అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విశేషం అన్నారు. IAMC నిర్మాణానికి గచ్చిబౌలి లోని ఐకియా వద్ద 3.7 ఎకరాల భూమిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి మంత్రులు…
ఉత్తర ప్రదేశ్ లో ఆఖరి, చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి విడతలో 9 జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. మొత్తం 613 అభ్యర్థులు పోటీలో వున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆఖరి విడతలో బీజేపీ, ఎస్పీ భాగస్వామ్య పక్షాల మధ్య పోటీ వుంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 54 స్థానాల్లో 29 స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తర్ ప్రదేశ్…
ఇవాళ యూపీలో ఆరవ విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడవ విడతలో మార్చి 7 న మిగిలిన 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.ఇవాళ10 జిల్లాల్లో 57 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2017 ఎన్నికల్లో 57 స్థానాల్లో 46 స్థానాల్లో బిజేపి గెలిచింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటివరకు 292 స్థానాల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. ఉత్తర్ ప్రదేశ్ లో కీలకమైన పూర్వాంచల్ ప్రాంతంలోని 111 అసెంబ్లీ స్థానాలపైనే అందరి దృష్టి పడింది. అంబేద్కర్…