టీడీపీ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. మహానాడు ఒక మహా స్మశానం. ఎన్టీఆర్ బతికి ఉంటే ఇవాళ వందో పుట్టినరోజు చేసుకుని ఉండేవారు. 73 ఏళ్ళ వయసులోనే ఆయనను హత్య చేసి ఇవాళ మహానాడు చేస్తున్నారు. ఆయన ఆత్మక్షోభ ప్రభావాన్ని చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి.
పప్పునాయుడు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని పదవి దించే పరిస్థితి ఉంటుందా? మంత్రులు పార్టీకి రిపోర్ట్ చేస్తారు అన్నాడంటే చంద్రబాబు అవగాహన లేని నాయకుడు అని అర్థం. మంత్రులు, ముఖ్యమంత్రులు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారు. చంద్రబాబుకు ప్రత్యేక రాజ్యాంగం ఉండదన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ సామాజిక న్యాయ భేరీ యాత్ర బ్రహ్మాండంగా సాగుతోందన్నారు. ఆశించిన దాని కంటే ఎక్కువ స్పందన వస్తోంది.
బలహీన వర్గాలు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా నిలబడే విధంగా చేయడమే మా ప్రయత్నం. జగన్ లేకుండా మమ్మల్ని ఆయన ప్రతినిధులుగా ప్రజలు చూసి ఆదరిస్తున్నారు. మేము సంబరం చేసుకుంటున్నాం. టీడీపీ అధికారంలోకి రాదు కనుకే నోటికి తోచినట్లు మాట్లాడుతున్నారు. ఉన్న వాళ్ళు కూడా జారి పోతారానే భయంతోనే ముందస్తు ఎన్నికలు అని చంద్రబాబు హడావిడి చేస్తున్నారు. టీడీపీకి సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం, స్థైర్యం రావాలని ఆకాంక్షిస్తున్నాం. రెండు ఊత కర్రలు ఎక్కడ దొరుకుతాయా అని వెదుకుతున్నారని ఎద్దేవా చేశారు సజ్జల.
Samajika Nyaya Bheri : మూడో రోజు సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర