సీఎం, ఇరిగేషన్ మంత్రులకు పీఏసీ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. అనంతపురం జిల్లా హంద్రీనీవా ప్రధాన కాల్వ రాగులపాడు వద్ద ఉన్న పంప్ హౌస్ వద్ద నిల్వ నీటిని పంప్ చేయాలని కేశవ్ లేఖలో కోరారు. గత 15 రోజుల నుంచి నీరు నిలిచిపోవటంతో రబీ సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఎకరాకు రూ.40వేల చొప్పున పెట్టుబడి పెట్టిన వేరుశనగ రైతులు దాదాపు 20వేల ఎకరాల్లో పంట వేసి నీటి…
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో కీలక మార్పులు రానున్నాయా? కేబినెట్లో మార్పులు, చేర్పులకు రంగం రెడీ అయిందా? ముహూర్తం కూడా పెట్టేశారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. జగన్ తన టీంలో పెను మార్పులకు సిద్ధం అవుతున్నట్టు తాడేపల్లి నుంచి సమాచారం అందుతోంది. మొదట మంత్రివర్గ ప్రక్షాళన, ఆతర్వాత పార్టీ ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది. ఇదంతా పూర్తయ్యాక అధికారుల ప్రక్షాళన వైపు జగన్ అడుగులు వేస్తారని భావిస్తున్నారు. చివరలో తన కుటుంబానికి సంబంధించి అతి కీలక…
తిరుమలలో కోవిడ్ నిబంధనలు సామాన్య భక్తులుకేనా? VIPలకు లేని ఆంక్షలు వారికే ఎందుకు? ముక్కోటి ఏకాదశి మొదలుకొని.. మిగతా రోజులవరకు కోవిడ్ పేరుతో సామాన్యలు శ్రీవారి దర్శనానికి దూరం కావాల్సిందేనా? ఏడాదిన్నరగా సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరం..!అఖిలాండకోటికి బ్రహ్మాండ నాయకుడైన ఏడుకొండలస్వామి దర్శనం కోసం ఎన్ని ప్రయాసలు ఎదురైనా ఆనందంగా భరిస్తారు భక్తులు. వారికి కావల్సిందల్లా.. శ్రీవారి దర్శనమే. అందుకే సామాన్య భక్తులకు ఎలాంటి ప్రణాళికలు.. సిఫారసులు ఉండవు. తమను గట్టెక్కించే స్వామివారు గుర్తుకొస్తే చాలు…
ఓ వైపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే.. మరో వైపు జాగ్రత్తలు పాటించాల్సిన ప్రజాప్రతినిధులు కోవిడ్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతున్నాయి నిబంధనలు పాటించండి అంటూ చెబుతున్నా.. మరో పక్క అధికార టీఆర్‌ఎస్ నాయకులే నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. రైతుబంధు సంబురాల పేరిట మంత్రులు ఎమ్మెల్యేలు, వారి వారి నియోజకవర్గాల్లో కార్యకర్తలు, రైతులతో కలిసి భారీ కార్యక్రమాలు, ర్యాలీలు చేపడుతున్నారు. వందల సంఖ్యలో ఒకే దగ్గర గూమిగూడటంలో వైరస్ వ్యాప్తి…
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది.. తాజాగా 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.. ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.. ఇక, ఆ సమావేశాలు ముగిసిన తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలుతోంది.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల అనంతరం వీరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అజిత్ పవార్ తెలిపారు. అయితే,…
నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు నల్లగొండకు చేరుకుంటారు. వారికి బైక్ ర్యాలీలతో టీఆర్‌ఎస్ శ్రేణులు స్వాగతం పలుకనున్నారు. ఉదయం 10:45 నిమిషాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ,ఎస్టీ హాస్టల్ ప్రారంభం. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ…
ఆంధ్రప్రదేశ్‌లో కేబినేట్ విస్తరణకు ఇంకా అవకాశం ఉందా లేదా అన్న అనుమానాలు రేకేత్తుతున్నాయి.కాగా ఇప్పట్లో ఏపీ క్యాబినేట్ విస్తరణ ఉండకపోవచ్చనే సమాధానం మాత్రం వస్తుంది. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో విస్తరించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని గతంలో జగన్ చెప్పినా మరికొన్నాళ్లు వేచి చూసే అవకాశం లేకపోలేదు. అటు విస్తరణలో అందర్ని మారిస్తే వారు శాఖలపై పట్టు సాధించేలోపు ఎన్నికలు వస్తాయని జగన్ ఆలోచిస్తున్నారు. 7-8 మందితో…