సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట డివిజన్ బండ మైసమ్మనగర్‌లో రూ.27.20 కోట్ల వ్యయంతో 310 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. వాటిని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు.
అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పేదలు ఆత్మ గౌరవంతో ఉండేలా ఇండ్లు నిర్మించాలని కలలు కన్నారని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ కలలను సనత్ నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సాకారం చేస్తున్నారని అన్నారు. డబ్బులు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటామంటే నష్ట పోతారు. చాలా పారదర్శకంగా ఇల్లు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
జిహెచ్ఎంసిలో 23 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలు పూర్తి అయ్యాయి. అందులో ఏడు కాలనీలు సనత్ నగర్ నియోజకవర్గంలో పూర్తి అయ్యాయని తెలిపారు. నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేయాలని కేటీఆర్ భావించారు. 60 వేల ఇండ్లు పూర్తి దశకు వచ్చాయి. 40 వేల ఇండ్లు త్వరలో పూర్తి అవుతాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేదల కలను ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని అన్నారు. కరోన కారణంగా ఇండ్ల నిర్మాణం ఆలస్యం అయ్యిందని తెలిపారు. బండ మైసమ్మ నగర్ లో ఒకప్పుడు అస్తవ్యస్తమైన డ్రైనేజీ, వర్షం నీటితో అద్వాన్నంగా ఉండేదని గుర్తు చేశారు. ఈ డబుల్ బెడ్రూమ్ సముదాయాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని అన్నారు. 11 లిఫ్టులు, బస్తీ దవాఖాన, కిరాణా షాపులు, మంచినీటి సదుపాయం ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఎవరికి అన్యాయం జరుగకాకుండా లాటరీ పద్దతిలో లబ్ధిదారుల ఎంపిక చేస్తామని అన్నారు. గొప్ప మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కొనయాడారు. రాజకీయ నాయకులు ఎవడేవడో ఏమో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండాకాలం 24 గంటల కరెంటు ఎప్పుడైనా చూశామా? అంటూ ప్రశ్నించారు. కళ్ళుండి చూడలేక పోతున్నారు కొందరు రాజకీయ నాయకులంటూ మండి పడ్డారు.
G7- India: గోధుమల ఎగుమతులను నిలిపేస్తే సంక్షోభం తీవ్రం అవుతుంది