కేబినెట్లో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు.
Peddi Sudarshan Reddy : తాజాగా బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపట్ల ఆయన స్వంతపార్టీ ఎమ్మెల్యేలో విశ్వాసం తగ్గిందని అన్నారు. ఆయన్ను స్వంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని., ఆయన సిఎం కావడం మెజారిటీ శాసన సభ్యులకు ఇష్టం లేదని, 64 మంది కాంగ్రెస్ నుండి గెలిస్తే అందులో కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సిఎం కు మద్దతు ఇస్తున్నారని ఆయన సంచలన…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి శనివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. సీఎంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన వారిలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త ఉన్నారు.
బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తన కేబినెట్‌ను విస్తరించారు. కొత్తగా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి 9 మంది, బీజేపీ నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
కాంగ్రెస్ మంత్రులపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేఆర్ఎంబీలో తెలంగాణ చేరిందని కేంద్రం సమావేశ మినిట్స్ లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు చేరలేదని రాష్ట్ర మంత్రులు బుకాయిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల నోటి మాట ప్రామాణికమా? మినిట్స్ ప్రామాణికమా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.
మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. బేసిక్ పే ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మున్సిపల్ కార్మికులకిస్తే అన్ని డిపార్ట్మెంట్లు అడుగుతాయని మంత్రుల బృందం తెలిపింది. దీంతో మున్సిపల్ కార్మిక సంఘాలు కూడా సమ్మె విరమించేదే లేదని ఖరాకండిగా ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని సంఘాలతో చర్చలు జరిగాయన్నారు. చర్చల తర్వాత వారి డిమాండ్ల మేరకు కొన్ని జీవోలు కూడా విడుదల చేయాలని నిర్ణయించామని…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది. సీఎంవో నుంచి నేతలకు ఫోన్లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇలా నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇంచార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు.