బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తన కేబినెట్‌ను విస్తరించారు. కొత్తగా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి 9 మంది, బీజేపీ నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
పాట్నా రాజ్‌భవన్‌లో అట్టహాసంగా మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వారితో ప్రమాణం చేయించారు. జేడీయూకి చెందిన లేషి సింగ్, మదన్ సాహ్ని, అశోక్ చౌదరి, షీలా మండల్,
జమా ఖాన్, మహేశ్వర్ హాజరై, రత్నేష్ సదా, సునీల్ కుమార్, జయంత్ రాజ్ ఉన్నారు.
ఇక బీజేపీకి చెందిన మంగళ్ పాండే, రేణు దేవి, నీరజ్ బబ్లూ, నితీష్ మిశ్రా, నితిన్ నబిన్, జనక్ రామ్, కేదార్ గుప్తా, దిలీప్ జైస్వాల్, కృష్ణానందన్ పాశ్వాన్, సంతోష్ సింగ్, సురేంద్ర మెహతా, హరి సాహ్ని తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
జనవరి 28న నితీష్‌కుమార్ మహా కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కేబినెట్ విస్తరణ పెండింగ్‌లోనే ఉంది. మొత్తానికి మార్చి 15న సాయంత్రం రాజ్‌భవన్‌లో 21 మంది కేబినెట్‌లో చేరారు.