మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. బేసిక్ పే ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మున్సిపల్ కార్మికులకిస్తే అన్ని డిపార్ట్మెంట్లు అడుగుతాయని మంత్రుల బృందం తెలిపింది. దీంతో మున్సిపల్ కార్మిక సంఘాలు కూడా సమ్మె విరమించేదే లేదని ఖరాకండిగా ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని సంఘాలతో చర్చలు జరిగాయన్నారు. చర్చల తర్వాత వారి డిమాండ్ల మేరకు కొన్ని జీవోలు కూడా విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు.
Read Also: CM Revanth Reddy : సీఎం రేవంత్‌ను కలిసిన సింగరేణి నూతన సీఎండీ
నాన్ పీహెచ్ కేటగిరీ ఉద్యోగులకూ రూ. 6 వేల ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తామని మంత్రి ఆదిమూలపు అన్నారు. స్కిల్, అన్ స్కిల్ సిబ్బంది విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయని.. రోస్టర్, పీఫ్ ఖాతాలు, ఎక్స్ గ్రేషియా అంశాలను పరిష్కరిస్తామని చెప్పామన్నారు. మరికొన్ని అంశాల పై మరోమారు చర్చలు జరుపుతామని చెప్పామని మంత్రి పేర్కొన్నారు. అప్పటి వరకూ కార్మికుల సమ్మె విరమించాలని కోరుతున్నట్లు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం అని నవరత్నాలలో పేర్కొన్నామన్నారు. కేవలం 50 మున్సిపాలిటీల్లో మాత్రమే సమ్మె ప్రభావం ఉంది.. ఇబ్బందులు ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశామని మంత్రి ఆదిమూలపు తెలిపారు.
Read Also: Love Affair: ప్రేమిస్తుందని కూతురిని, ఆమె లవర్‌ని నరికి చంపిన తండ్రి..