Cm Revanth Reddy: మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
- వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేసిన సీఎం
- అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశం
- ఇప్పటికే 141వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి శనివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. సీఎంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన వారిలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్ గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ ను ఇంటిగ్రేట్ చేయాలని తెలిపారు. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు.
READ MORE: Bandi Sanjay Kumar: కేసీఆర్ వివరణ అహంకార పూరిత వైఖరికి నిదర్శనం: బండి సంజయ్
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఇప్పటికే 141వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు వారికి తెలిపారు. వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద నీరు వెళ్లేలా వాటర్ హార్వెస్ట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డుపై నీరు నిల్వకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చరపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోమ్ గార్డుల రిక్రూట్ మెంట్ చేపట్టాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!