ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం తరుఫున ఘన స్వాగతం పలికారు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిఖత్ జరీన్‌కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఆణిముత్యాలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించిందని…
ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం సాధించి అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్. అయితే నేడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరుపున క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నాకు ఇంతటి…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ అగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. కళ్ళకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారా? 30 వేల మంది కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని ఆయన మండిపడ్డారు. పిచ్చోడిలా బీజేపీ నేతలు తిరుగుతున్నారని, చేతగాక వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నారన్నారు. బహిరంగ సభలో…
ఇటీవల రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 148 మంది యువతి యువకులను పట్టుకున్న ఘటన ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లోని రాడిసిన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో మత్తు మందులు స్వాధీనం చేసుకున్న సంఘటన పై…
వరంగల్ జిల్లా అంటే ఉద్యోమాన్ని మలుపు తిప్పిన జిల్లా అని, కాకతీయుల పాలించిన జిల్లా వరంగల్ జిల్లా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏంతో మంది పాలించిన వరంగల్, అభివృద్ధి లో లేకపోయినా కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారన్నారు. వైద్య రంగంలో మొదటి స్థానంలో వరంగల్ ఉండబోతోందని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఫలితం వల్లనే రామప్పకు యోనిస్కో గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రానికి అభివృద్ధి పనులు చేయనికి చిత్త శుద్ధి లేదని, వరంగల్…
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త జోగినపల్లి సంతోష్ కుమార్ సూచనల మేరకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగంగా విత్తన బంతులను తయారు చేసి విత్తన బంతులతో అతి పెద్ద వాక్యాన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించారు. అయితే ఈ అవార్డు ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు…
Minister Srinivas Goud Inaugurated New Boating at Koyil Sagar. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటకంగా అభివృద్ది జరగలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాపికొండలు, నాగర్జున సాగర్ లోని వారి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.…
ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యకు ప్లాన్ చేయగా, వారి ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా మంత్రి హత్యకు కుట్ర వెనుక బీజేపీ నేతలు ఉన్నారంటూ ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటనను మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తొడ గొట్టి సవాల్ విసిరినా.. తన జీవితాన్ని చెప్పి కేసీఆర్‌ను నవ్వించిన మంత్రి మల్లారెడ్డికి బెదిరింపు కాల్స్ రావడం చర్చనీయాంశంమైంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి…
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కోణంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంతోకాలంగా ప్రతీకారంతో రగలిపోతున్న వ్యక్తే ఆయన్ను అంతమొందించేందుకు, సుపారీ ముఠాతో కలసి పథక రచన చేసినట్టు బయటపడుతోంది. ఈ కేసు నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు.. రాఘవేంద్రరాజు కుటుంబ సభ్యులు సమావేశమైనట్లు,ఆర్థికంగా ఎదగనీయకుండా చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ను.. హత్య చేయడమే మార్గమని అన్నదమ్ములు భావించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌గౌడ్‌పై కోర్టు…
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం కేసుపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర స్క్రిప్ట్ చదివారు. నేను మున్నూరు రవి కి ఆకామిడేషన్ ఇచ్చాను. షెల్టర్ ఇవ్వలేదు. ఆయన తెలంగాణ ఉద్యమ కారుడు. మళ్ళీ కూడా ఆకామిడేషన్ ఇస్తాను. నా పీఏ ను కాంటాక్ట్ అయ్యాడు. మున్నూరు రవి మొదటి సారి ఉండలేదు… ఇంతకు ముందు కూడా ఉన్నాడు. మున్నూరు రవి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పై ఎలాంటి ఆరోపణలు…