వరంగల్ జిల్లా అంటే ఉద్యోమాన్ని మలుపు తిప్పిన జిల్లా అని, కాకతీయుల పాలించిన జిల్లా వరంగల్ జిల్లా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏంతో మంది పాలించిన వరంగల్, అభివృద్ధి లో లేకపోయినా కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారన్నారు. వైద్య రంగంలో మొదటి స్థానంలో వరంగల్ ఉండబోతోందని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఫలితం వల్లనే రామప్పకు యోనిస్కో గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రానికి అభివృద్ధి పనులు చేయనికి చిత్త శుద్ధి లేదని, వరంగల్ ఫోర్ట్ , వేయి స్తంభాల దేవాలయలను యూనిస్కో గుర్తింపు తెస్తామన్నారు. గుడిల మీద రాజకీయం చేస్తున్నారని, కానీ గుడికి రూపాయి కూడా పెట్టరని ఆయన బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. వరంగల్ లో హరిత హోటల్ కోసం కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వంలో అభివృద్ధి లో ఉందని, కళాక్షేత్రం రూపకల్పన చేస్తామన్నారు. రానున్న రోజుల్లో దీన్ని అద్భుతమైన మ్యూజియం గా రూపొందిస్తామని ఆయన తెలిపారు.