రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కోణంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంతోకాలంగా ప్రతీకారంతో రగలిపోతున్న వ్యక్తే ఆయన్ను అంతమొందించేందుకు, సుపారీ ముఠాతో కలసి పథక రచన చేసినట్టు బయటపడుతోంది. ఈ కేసు నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు.. రాఘవేంద్రరాజు కుటుంబ సభ్యులు సమావేశమైనట్లు,
ఆర్థికంగా ఎదగనీయకుండా చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ను.. హత్య చేయడమే మార్గమని అన్నదమ్ములు భావించినట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్‌గౌడ్‌పై కోర్టు కేసుల కోసం.. రాఘవేంద్రరాజు కుటుంబం రూ.4 కోట్లు ఖర్చు చేసింది. జిరాక్స్ బిల్లులకే రాఘవేంద్రరాజు రూ.18 లక్షలు ఖర్చు చేశారు. శ్రీనివాస్‌గౌడ్ అనుచరుడు ఆనంద్‌ను గతంలో నాగరాజు కత్తితో పొడిచాడు. అయితే ఆనంద్, హైదర్‌అలీ, శ్రీకాంత్‌గౌడ్ తమను వేధిస్తున్నారని రాఘవేంద్రరాజు బ్రదర్స్ పోలీసులకు వెల్లడించారు. తన భార్యతో పాటు తన తమ్ముళ్ల భార్యలను అరెస్ట్ వెనుక.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హస్తముందన్న రాఘవేంద్రరాజు.. రాజకీయంగా వాడుకొని వదిలేసినందుకే చంపాలనుకున్నామని తెలిపినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు.