Minister Srinivas Goud Inaugurated New Boating at Koyil Sagar.
మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పర్యాటకంగా అభివృద్ది జరగలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాపికొండలు, నాగర్జున సాగర్ లోని వారి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. రామప్ప ఆలయం, భూదాన్ పోచంపల్లి స్వరాష్ట్రంలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందటం ఇందుకు నిదర్శనమని ఆయన వెల్లడించారు.
అభివృద్ది చేసేవారిపై విమర్శలు చేయడం తగదని, 70 ఏళ్లలో జరగని అభివృద్ది 8 ఏళ్లలో జరిగిందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది వరకు కొయిల్ సాగర్ వద్ద పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. కర్వెన.. ఉదండాపూర్ రిజర్వాయర్లకు పర్యాటక శోభ తెచ్చేందుకు ముందస్తుగా ప్రణాళికలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు.