తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందుతుంది.. గులాబీ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది.. అయితే, బీఆర్ఎస్ గుజరాత్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ పోటీచేసిన చోట కూడా మా పార్టీ పోటీ చేయబోతుందన్నారు.. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటికే సిద్ధం అవుతున్నాయి.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రచారం మొదలు పెట్టాయి. ఎన్నికల…
ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ టికెట్ల విక్రయంపై వివాదం నెలకొంది. ఈ వివాదంపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హెచ్‌సీఏ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
Gymkhana Stadium: జింఖానా మైదానంలో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. HCA ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సహా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మధ్యాహ్నం 3 గంటలకు తన కార్యాలయానికి రావాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. టికెట్ల విక్రయాలపై పూర్తి సమాచారంతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు HCAకు నోటీసులిచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. జింఖానా గ్రౌండ్ లో టికెట్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయని HCAపై చర్యలకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు.…
తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని తిరుపతి వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించానని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇవాళ (జూన్ 13న) ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి…
రేవంత్ రెడ్డికి కులం పిచ్చి.. బీజేపీ కి మతం పిచ్చి.. అంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పాలమూరు స్టేడియం గ్రౌండ్ లో 40 లక్షల అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో నారాయణపేట అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వక్తం చేశారు. తెలంగాణ వచ్చాక పూర్వ వైభవం తెస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంగా మార్చామని గుర్తు చేశారు. తెలంగాణాలో ఏ అభివృద్ధి పని…