నేడు క్రీడా దినోత్సవం సందర్బంగా తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓయూలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరైయ్యారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మరో ఇరువై ఏళ్ళు అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని కామెంట్స్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి మేమంతా కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. అలాగే…
తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం క్యాంపస్ కి వెళ్లారు. ఈ సందర్బంలో విద్యార్థులు మంత్రికి అడ్డుగా వచ్చి గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తంచేశారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ హామీలు ఏమైయ్యాయంటూ నిలదీశారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో మంత్రి క్యాంపస్…
జల జగడం రోజురోజుకీ తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల మధ్య మాటల దాడిని పెంచుతోంది.. తాజాగా.. ఈ వ్యవహారంలో స్పందించిన తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగిన ఊరుకునే ప్రసక్తేలేదు.. ప్రాణాలు పోయినా పోరాడుతామని వ్యాఖ్యానించారు.. తెలంగాణకు ఎవరు నష్టం చేసినా పార్టీలకు అతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చిన ఆయన.. తెలంగాణ నీళ్లను ఎవరు దోసుకపోయినా అడ్డం నిలబడాలని.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కించపరిచేలా మాట్లాడినా అందరం ఏకతాటిపైకి…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం విషయంలో రోజురోజుకీ విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి.. ఏపీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ మంత్రులు.. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్.. ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త వాదన తెరమీదకు తెస్తున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం కొత్త వాదన సరికాదన్న ఆయన.. నీటి వాటాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోండి అనడంలో ఆంతర్యం చెప్పాలి? ఏపీ…
నేడు సిద్ధిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో రూ.3 కోట్ల 72 లక్షల 40 వేల వ్యయంతో నిర్మించిన 56 డబుల్ బెడ్ రూం ఇండ్లకు మంత్రులు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల కండ్లలో ఆనందం చూస్తుంటే…
ఈటల రాజేందర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. హుజరాబాద్ ఎన్నిక అభివృద్ధి చేసిన పార్టీకి…అభివృద్ధి చేయని పార్టీలకు మధ్య పోటీ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్ రాజీనామా చేస్తూ మాట్లాడిన మాటలకు అభ్యంతరం చెబుతున్నామని.. ఏది ధర్మం… ఏది అధర్మం అని ఈటలపై మండిపడ్డారు. కేసీఆర్, టిఆర్ఎస్ లేకుంటే ఈటల ఎక్కడ ఉండేవారు ? ఈటలను అనేక విషయాల్లో కేసీఆర్ నమ్మారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ తనకు తాను తప్పులు…