తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. కుట్ర కేసులో కీలక దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసుకి సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. జితేందర్ డ్రైవర్ ను, పీఏను విచారించనున్నారు పోలీసులు. అలాగే, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ల పాత్ర పై విచారణ చేయనున్నారు పోలీసులు. మంత్రి హత్య కుట్ర కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చారు…
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర వ్యవహారం తెలంగాణ సంచలనంగా మారిపోయింది.. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర… మహబూబ్ నగర్‌కు చెందిన యాదయ్య, రఘు, విశ్వనాథ్, నాగరాజు ఈ హత్యకు కట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తితో రూ.15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని.. అయితే ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్యకు జరిగిన కుట్ర బయటపడిందన్నారు.. ఫిబ్రవరి 23వ…
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది.. శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల అఫిడవిట్ అక్రమాల కేసుకు.. ఈ ప్లాన్‌కు లింక్ ఉన్నట్టు ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.. గతంలో శ్రీనివాస్‌గౌడ్ అఫిడవిట్‌లో అక్రమాలున్నాయంటూ ఫిర్యాదులు ఉన్నాయి.. ఆ ఫిర్యాదులు ఇచ్చినవారినే కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో.. ఆ కిడ్నాప్ కేసుకు.. ప్రస్తుత హత్య కుట్ర కేసుకు లింకులు తెరపైకి వచ్చినట్టు అయ్యింది. కాగా, ఢిల్లీలో మహబూబ్‌నగర్‌కు…
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది.. ఆ కుట్రను భగ్నం చేశారు సైబరాబాద్ పోలీసులు.. కొందరు దుండగులు మంత్రిని హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు.. పేట్ బషీరాబాద్‌లో నిందితులను అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్‌లో సుపారీ కిల్లర్స్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఈ కుట్ర భగ్నం చేశారు.. మొత్తం ఏడుగురుని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు… ఇక, మంత్రి హత్యకు రూ.12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ సుపారీ కిల్లర్లను కలిసింది…
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటుతామని, కేసీఆర్ కు బుద్ధి చెబుతామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఈనెల 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తొలుత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో హైదరాబాద్ నుండి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయ్యింది.…
వరంగల్ నగరానికి ప్రతీకగా వున్న భద్రకాళీ అమ్మవారి దేవాలయ పరిసరాలను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే భద్రకాళీ బండ్ ను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్టు తెలిపారు. అలాగే బండ్ పై జరుగుతున్న పనులనుకూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు బండ్ పై కలియ తిరిగి సందర్శకుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారు. బండ్ ఆధునీకరణ ఎలా వుంది?…
గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. గంజాయి సాగు చేస్తున్న రైతుల, పండిస్తున్న భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులచే ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో గంజాయి రవాణా చేస్తున్న వారిపై, అనుమానితులపై నిఘా ఉంచాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న సాగుచేస్తున్న…
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టు వాగుపై కురుమూర్తి స్వామి దేవాలయం వరకు కాజ్ వే బ్రిడ్జి, చెక్ డ్యామ్, బీటీరోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డితో కలిసి భూమిపూజలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. 70 ఏళ్ళుగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా.. ముఖ్యమంత్రిగా కూడా పదవులు అనుభవించిన వారున్నారు.. వాళ్ళు ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు.…
ఏపీ భూములపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో 10 ఎకరాలు అమ్మితే.. తెలంగాణ లో 100 ఎకరాలు కొనేవారని.. ఇప్పుడు రివర్స్ అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చర్ క్లబ్‌లోఅల్లూరి సీతారామరాజు 125 వ జయంతి జాతీయ సంబరాలు ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ…