ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యకు ప్లాన్ చేయగా, వారి ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా మంత్రి హత్యకు కుట్ర వెనుక బీజేపీ నేతలు ఉన్నారంటూ ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటనను మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తొడ గొట్టి సవాల్ విసిరినా.. తన జీవితాన్ని చెప్పి కేసీఆర్‌ను నవ్వించిన మంత్రి మల్లారెడ్డికి బెదిరింపు కాల్స్ రావడం చర్చనీయాంశంమైంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ మేరకు బోయిన పల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు.
తనకు గత కొద్ది రోజులుగా బెదిరింపు కాల్స్ తో పాటు అసభ్య మెసేజ్ లు వస్తున్నాయని మల్లారెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనేక నెంబర్ల నుంచి తనకు కాల్స్ తో పాటు మెసేజ్ లు కూడా వస్తున్నాయని మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన పోలీసులు విజయవాడకు చెందిన లారీ డ్రైవర్ వాసును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మంత్రి మల్లారెడ్డిపై విజయవాడకు చెందిన వాసుకు ఉన్న ఆగ్రహం ఏంటి? ఈ బెదిరింపు కాల్స్ కు సంబంధించి వాసుతో పాటు ఇంకా ఎవరున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. వరుసగా టీఆర్‌ఎస్ మంత్రులపై ఇలాంటి ఘటనలు జరగడంపై టీఆర్‌ఎస్ నేతల్లో తెలియని ఆందోళన మొదలైంది.