ప్రధాని సభకు రావాలంటూ జగన్‌కు ఆహ్వానపత్రిక.. పీఏకు ఇచ్చి వెళ్లిన అధికారులు అమరావతిలో శుక్రవారం రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ను కూడా ఆహ్వానించింది. శుక్రవారం జరిగే ప్రధాని మోడీ సభకు రావాలంటూ తాడేపల్లిలోని…
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యం గా ఉండాలి.. తెలంగాణ- ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి అన్నారు.
Minister Seethakka: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ చూసాకా... ఓ నియంత అధికారం పోయాక ప్రజల దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నట్టు ఉంది అని మంత్రి సీతక్క ఎద్దవా చేశారు. బాధ ఎవరి కోసం.. అధికారం పోయిందని బాధ తప్పితే ఇంకేం బాధ అని ప్రశ్నించింది.
పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తుంది.. ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకమైన రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాం అని తేల్చి చెప్పారు. కానీ, గత వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా కొనసాగింది అని ఆరోపించారు. ఇప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని చక్కబెడుతున్నాం…
ఆ సినిమాలో దారుణంగా నటించా.. సమంత సంచలనం.. స్టార్ హీరోయిన్ సమంత సినిమాల్లో నటించి చాలా రోజులు అవుతోంది. ఆమె చాలా రోజుల తర్వాత సొంతంగా ‘శుభం’ అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తోంది. వరుసగా ప్రమోషన్లు చేస్తూ మూవీపై హైప్ పెంచుతోంది సమంత. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే అయినా.. నటనతో…
నిర్మల్ జిల్లా పోలీసు వ్యవస్థలోనే మరో ముందడుగు పడింది. మహిళలు అన్నీ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ధ్యేయం చొరవతో టీం శివంగిని ఏర్పాటు చేశారు. అయితే.. టీం శివంగిని మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలు అన్నింటిలో ముందుండాలి అని ఎస్పీ జానకీ షర్మిల కృషి అమోఘమన్నారు. ఈ మధ్య మామడ చిట్టడవిలో తప్పిపోయిన నలుగురి ఆడవారిని వెతికి పట్టుకోవటం లో వీరు పడ్డ కష్టం అభినందనీయమని, రాష్ట్రం…
Minister Seethakka: ఆదిలాబాద్ జిల్లాలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణితో దందాలు చేశారు.. అలాంటి వాటికి ఇప్పుడు భూభారతిలో చోటు లేదన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలన్న బండి సంజయ్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని సీతక్క అన్నారు. 2013లో ఆహార భద్రత చట్టాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని సీతక్క స్పష్టం చేశారు. బండి సంజయ్ కి…
Minister Seethakka: శాసన మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సవరణ-2025 బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు.
సంక్షేమం అనే పదానికి అర్థమే మారిపోతుందని మంత్రి సీతక్క అన్నారు. బీపీఎల్ కింది వర్గాలకు ఆర్థిక సాయం చేసే పద్ధతి పోయిందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. చెరువులను తెంపి చాపలు పంచే విధానంగా సంక్షేమము మారిందన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ, పి ఆర్ ఆర్ బి, మహిళా సీ సంక్షేమ శాఖలకు గతంతో పోలిస్తే అత్యధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని.. అందుకే ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా తెలంగాణ…