పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత ఇలాకాలో పర్యటించనున్నారు మంత్రి సీతక్క. రేపు (ఆదివారం) ఉదయం హైదరాబాద్ క్వార్టర్స్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ఉదయం 9:15 గంటలకు ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్ పల్లికి చేరుకుంటారు. అనంతరం.. ఉదయం 10:15కు ములుగు గట్టమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
హైదరాబాద్‌లో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖపై మంత్రి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై తీసుకుంటున్న విషయాలను గురించి ఆరా తీసిన మంత్రి..