రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ, అభయహస్తం గ్యారెంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
Minister Seethakka Visits Utnoor Ashram School: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివారం రాత్రి ఆశ్రమ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అంతేకాదు ప్రతి గదికి వెళ్లి అక్కడి సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి.. అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, తదితరులు పాల్గొన్నారు.…
సంచలనం రేపుతున్న మీర్జా రిమాండ్ రిపోర్ట్.. స్నాప్ చాట్ ద్వారా డ్రగ్స్ సప్లై తెలంగాణలో రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్. అప్పటికే 14 మందిని అదుపులో తీసుకున్న పోలీసుల విచారణలో రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇవాళ గచ్చిబౌలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ హాజరైన విషయం తెలిసిందే.. ఇక రిమాండ్ లో వున్న మీర్జా వాహిద్ బేగ్ విచారించగా పోలీసులకు రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు…
Medaram Jathara:ములుగు జిల్లా మేడారం మహాజాతరలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం మేడార జాతరకు వెళ్లిన గవర్నర్ సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు.
మేడారంలో భక్తుల కోసం తాత్కాలిక బస్ స్టేషన్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. 55 ఎకరాల్లో బెస్ క్యాంప్‌తో కూడిన బస్ స్టాండ్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఓకే సారి 30 వేల మంది క్యూ లైన్లో ఉండేలా బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. మేడారం వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి సుధాకర్ ప్రారంభానికి…
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో రాంజీ గోండు ట్రైబల్ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రామ్‌జీ గోండు పోరాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, ఇతర నేతలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. నాగోబాను దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు మంత్రలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.
సీఎంకి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉంది అని మంత్రి సీతక్క తెలిపారు. అభివృద్ధికి ముందడుగు ఇక్కడి నుంచే బాటలు పడుతాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనక బడి ఉంది.. రేవంత్ రెడ్డి మొదటి సభ భట్టి విక్రమార్క పాదయాత్ర ఈ జిల్లా నుంచే ప్రారంభించారు.
Minister Seethakka:పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు.
Minister Seetakka: సీతక్క - కొండా సురేఖ ఇద్దరు మహిళా మంత్రులు వరంగల్ జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకున్నారు.